ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి దిగ్గజం ఎలన్ మస్క్ కు కొత్త చిక్కుల్లో చిక్కుకున్నారు. మస్క్ ప్రతిష్టాత్మకంగా తీసుకురావాలని చూస్తున్న బ్రెయిన్- కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ స్టార్టప్ న్యూరాలింక్ ప్రాజెక్టును ప్రారంభించి ఏడాది పూర్తయింది. ఏడాది బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ ఫేస్ టెక్నాలజీపై పరిశోధనలు చేస్తున్నారు. అయితే, దీనిపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు ఎదురౌతున్నాయి. ఈ ఏడాది మనిషి ప్రయోగాలు చేయబోతున్నారని చాలా కాలంగా చెబుతూ వస్తున్నారని, కానీ, ఈ ప్రాజెక్టు సక్సెస్ కాదని పలువురు మాజీ ఉద్యోగులు చెబుతున్నారు. ఎలన్ మస్క్ తీసుకొచ్చిన ఈ ప్రాజెక్టు పనికిమాలిన ప్రాజెక్ట్ అని, ఈ ప్రాజెక్టులో పనిచేస్తున్న ఉద్యోగులు మానసికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీలు విమర్శిస్తున్నారు.
Read: ఎ.ఆర్.రహమాన్ వైపు యన్టీఆర్, విజయ్ చూపు…
ఎవరూ కూడా సంతృప్తికరంగా పనిచేయడం లేదని, కేవలం డబ్బుకోసమే పనిచేస్తున్నారని విమర్శించారు. కోతుల బ్రెయిన్‌కు, మనుషుల బ్రెయిన్‌కు చాలా తేడాలు ఉంటాయని, కోతుల్లో సక్సెస్ అయిందని, మనుషుల్లో సక్సెస్ కావాలని అనుకోవడం పొరపాటే అవుతుందని విమర్శిస్తున్నారు. పనిగంటలు, జీతంతో పాటు వేధింపులు కూడా న్యూరాలింక్ లో ఉన్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. న్యూరాలింక్ సహవ్యవస్థాపకుడు మ్యాక్స్ హోడాక్ న్యూరాలింక్‌ను వదలి బయటకు రావడం వెనుక కారణం ఎంటని కొందరు మాజీలు ప్రశ్నిస్తున్నారు.