దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా హైస్పీడ్ ఇంటర్నెట్‌ను అందించాలనే ఉద్దేశంతో ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ స్టార్‌లింక్ పేరుతో ఉపగ్రహాలను ప్రయోగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్టార్‌లింక్స్ ఉపగ్రహాలు ఒకదానితో మరోకటి ఇంటర్‌లింక్ అయ్యి ఉంటాయి. ఇటీవలే 49 స్టార్ లింక్స్ ఉపగ్రహాలను ప్రయోగించింది స్పేస్ ఎక్స్ సంస్థ. ప్రయోగించిన 49 స్టార్‌లింక్స్ ఉపగ్రహాల్లో 40 దారితప్పాయి. ఇందులో కొన్ని ఉపగ్రహాలు భూవాతావరణంలోకి ప్రవేశించి భూమిపై కూలిపోయాయి.
Read: Covid 19: ఆ వ్యక్తిని వదలని కరోనా…78 సార్లు పాజిటివ్…
సూర్యుని నుంచి సౌరతుఫాన్ ప్రమాదం పొంచి ఉందని, ఈ సౌరతుఫాన్ కారణంగా ఉపగ్రహాలకు ఇబ్బందులు వస్తాయని యూఎస్ వాతావరణశాఖ ముందుగానే హెచ్చరించింది. ఇక కూలిపోయి స్టార్‌లింక్స్ ఉపగ్రహాల దృశ్యాలను ప్యూర్టోరికోకు చెందిన ఆస్ట్రోనోమియా డెల్ కెర్బి అనే సంస్థ చిత్రీకరించింది. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.