Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్ల విషయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే లాటరీ కింగ్‌గా పిలువబడే శాంటియాగో మార్టిన్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. మొత్తం ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలులో ఈయన కంపెనీ ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ అగ్రస్థానంలో ఉంది. ఈ సంస్థ రూ. 1368 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయగా.
Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్స్‌కి సంబంధించి తాజాగా ఈసీ ఈ రోజు కొత్త సమాచారాన్ని విడుదల చేసింది. 2018లో ప్రవేశపెట్టిన ఈ బాండ్ల ద్వారా అధికార బీజేపీకి గరిష్టంగా రూ. 6986.5 కోట్ల నిధులు అందాయి. ఆ తర్వాత స్థానంలో పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (రూ. 1,397 కోట్లు), కాంగ్రెస్ (రూ. 1,334 కోట్లు), BRS (రూ. 1,322 కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ ఎలక్టోరల్ బాండ్ల విషయంలో అగ్రకొనుగోలుదారుగా ఉన్న…
Lok Sabha Election : ఎలక్షన్ కమిషన్ ఎలక్టోరల్ బాండ్ డేటాను విడుదల చేసినప్పటి నుండి, కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంది.
ఎలక్టోరల్ బాండ్ల పథకంపై విచారణ జరిపించాలని, విచారణ పూర్తయ్యే వరకు బీజేపీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే శుక్రవారం డిమాండ్ చేశారు.
ఎలక్టోరల్ బాండ్లను మొదటి నుంచి తాము వ్యతిరేకించినట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి కే. నారాయణ తెలిపారు. రాజకీయాలను ధ్వంసం చేసేందుకే ఎలక్టోరల్ బాండ్లను తీసుకొచ్చారని మండిపడ్డారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. ఎస్బీఐ వ్యవహారశైలి సరిగా లేదు.. ఎస్బీఐ దగ్గర వివరాలు అందించే టెక్నాలజీ లేదా ? అని ప్రశ్నించారు. సమయం లేదు అని దొంగలను కాపాడేందుకే ఎస్బీఐ వివరాలు సరిగా ఇవ్వలేదని విమర్శించారు. ఏ పార్టీకి ఇచ్చారో సమాచారం ఇవ్వలేదని అన్నారు. ఎవరెవరికి, పార్టీలకు ఎంత ఇచ్చారో…
ఎలక్టోరల్ బాండ్లపై దేశంలో ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఈ విషయంలో సుప్రీంకోర్టు కఠినమైన తీర్పును ఇచ్చిన సంగతి తెలిసిందే. అన్ని జాబితాలను బహిరంగపరచాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల తర్వాత, ఎన్నికల విరాళాలు ఇచ్చే కంపెనీల జాబితా, స్వీకరించే పార్టీల విరాళాల జాబితాను ఎన్నికల సంఘం బహిరంగపరిచింది.
Electoral bonds: సుప్రీంకోర్టు నుండి మందలింపు తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే SBI నుండి స్వీకరించిన ఎలక్టోరల్ బాండ్ డేటాను ఎన్నికల సంఘం గురువారం బహిరంగ పరిచింది. డేటా పబ్లిక్‌గా మారిన తర్వాత ఆ కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు ఇంక్రిమెంట్ ఇవ్వడంలో వెనుకాడుతున్నాయి.
జూన్ 30 వరకు గడువును పొడిగించాలని కోరుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని ఎన్నికల కమిషన్‌కు సమర్పించేందుకు ఎస్‌బీఐకి మార్చి 12 వరకు అంటే రేపటి వరకు సుప్రీంకోర్టు గడువు ఇచ్చింది.
ఎన్నికల బాండ్లవివరాల వెల్లడికి ఎస్బీఐ అదనపు సమయం కోరడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. భారత ఎన్నికల కమిషన్‌కు అన్ని ఎలక్టోరల్ బాండ్ లావాదేవీల వివరాలను అందించడానికి అదనపు సమయం కావాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది.