ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడించేందుకు సమయం పొడిగించాలని కోరుతూ ఎస్‌బీఐ (SBI) వేసిన పిటిషన్‌పై మార్చి 11న సుప్రీంకోర్టు (Supreme court) విచారణ చేపట్టనుంది.
ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని ఎన్నికల కమిషన్‌కు ఇవ్వడానికి జూన్ 30 వరకు సమయం కావాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టును కోరింది. ఫిబ్రవరి 15న ఎలక్టోరల్ బాండ్ స్కీమ్‌ను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంలో, మార్చి 6లోగా ఎన్నికల కమిషన్‌కు జారీ చేసిన ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని అందించాలని ఎస్‌బీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ ఇవాళ ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ పథకాన్ని ఒక కుంభకోణంగా ఆయన అభివర్ణించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అవినీతి రాజకీయాలు మరోసారి బహిర్గతం అయ్యాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్టోరల్ బాండ్లను బీజేపీ లంచం, కమీషన్ల కోసమే స్వీకరించేందుకు సాధనంగా మార్చుకుందని ఆరోపించాడు.
ఎలక్టోరల్ బాండ్లను 1000 రూపాయల నుంచి 10,000 రూపాయలు, లక్ష రూపాయలు, కోటి రూపాయల వరకు గుణిజాలలో కొనుగోలు చేయవచ్చు. ఈ బాండ్లు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శాఖలలో మాత్రమే అందుబాటులో ఉంటాయి.
30వ విడత ఎలక్టోరల్ బాండ్ల అమ్మకాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇవాళ్టి నుంచి వీటి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాల విషయంలో పారదర్శకత తీసుకు వచ్చేందుకు ఈ బాండ్లను ప్రవేశ పెట్టింది.