ఫార్ములా ఈ కార్ రేస్‌కు సంబంధించిన కేసులో తెలంగాణ ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) దర్యాప్తు వేగవంతం చేసింది. సుదీర్ఘంగా 9 నెలల పాటు సాగిన విచారణ అనంతరం, ఈ కేసులో కీలక నివేదికను ఏసీబీ ప్రభుత్వానికి సమర్పించింది.
Formula E race inquiry: ఫార్ములా ఈ రేసు కేసులో భాగంగా గ్రీన్కో, ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీ ప్రతినిధులు నేడు ఆంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) ముందు విచారణకు హాజరుకానున్నారు. సీజన్ 9 రేసుకు సంబంధించి రెండు కంపెనీలపై ఏసీబీ పలు ప్రశ్నలు సంధించనుంది. ఫార్ములా ఈ సీజన్ 9 కోసం గ్రీన్కో కంపెనీ కేవలం మొదటి విడతగా 30 కోట్లు మాత్రమే చెల్లించింది. అయితే మిగతా రెండు విడతల డబ్బులు ఫార్ములా ఈ ఆర్గనైజర్…
ఎలక్టోరల్ బాండ్లపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రీన్ కో ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చింది 2022లో.. ఫార్ములా ఈ- రేస్ జరిగింది 2023లోనని తెలిపారు. గ్రీన్ కో ఎలక్టోరల్ బాండ్లు కాంగ్రెస్, బీజేపీకి కూడా ఇచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ- కార్ రేసు కారణంగా గ్రీన్ కో నష్టపోయిందని అన్నారు.
Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదు చేయాలని బెంగళూరు తిలక్‌నగర పీఎస్ పోలీసులను చట్టసభ ప్రతినిధుల న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
కాంగ్రెస్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎలక్టోరల్ బాండ్ల వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ పథకం అని వ్యాఖ్యానించిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై అమిత్ షా తీవ్రంగా స్పందించారు
సార్వత్రిక ఎన్నికల వేళ ఎలక్టోరల్ బాండ్ల వివరాల పంచాయితీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలక్టోరల్ బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేసింది.
Electoral bonds: సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని ఈ రోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) వివరాలను కేంద్రం ఎన్నికల సంఘానికి అందించింది. బాండ్లకు సంబంధించి అన్ని ముఖ్యమైన ప్రత్యేక నంబర్లను కూడా అందించింది. ఇది నిధులు ఇచ్చిన దాతలు, తీసుకున్న పార్టీల వివరాలను సరిపోల్చడానికి సహాయపడుతుంది. బ్యాంక్ ఇచ్చిన వివరాలను ఎన్నికల సంఘం త్వరలో తన వెబ్‌సైట్‌లో పొందుపరుచనుంది. అకౌంట్ నంబర్, కేవైసీ డిటెయిల్స్ వెల్లడి కానున్నాయి.
ఎలక్టోరల్ బాండ్ కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై కఠినంగా వ్యవహరించింది. ఎలక్టోరల్ బాండ్ల సమాచారం ఇవ్వడానికి ఎందుకు వెనుకాడుతున్నారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఎందుకు పూర్తి నంబర్లు ఇవ్వలేదు.. ఎలక్టోరల్ బాండ్ కేసులో ఎస్‌బీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Electoral Bonds : ఇటీవల కాలంలో ఎలక్టోరల్ బాండ్ల విషయం ఎంతటి సంచలనంగా మారిందో చెప్పాల్సిన పనిలేదు. గత ఐదేళ్లలో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు అత్యధిక డబ్బును విరాళంగా అందించిన ఫ్యూచర్ గేమింగ్ సంస్థ ఒక్క డీఎంకే పార్టీకి రూ.509 కోట్లు విరాళంగా అందించింది.