CPI Narayana: ఎలక్టోరల్ బాండ్లను మొదటి నుంచి వ్యతిరేకించాం.. నారాయణ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎలక్టోరల్ బాండ్లను మొదటి నుంచి తాము వ్యతిరేకించినట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి కే. నారాయణ తెలిపారు. రాజకీయాలను ధ్వంసం చేసేందుకే ఎలక్టోరల్ బాండ్లను తీసుకొచ్చారని మండిపడ్డారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. ఎస్బీఐ వ్యవహారశైలి సరిగా లేదు.. ఎస్బీఐ దగ్గర వివరాలు అందించే టెక్నాలజీ లేదా ? అని ప్రశ్నించారు. సమయం లేదు అని దొంగలను కాపాడేందుకే ఎస్బీఐ వివరాలు సరిగా ఇవ్వలేదని విమర్శించారు. ఏ పార్టీకి ఇచ్చారో సమాచారం ఇవ్వలేదని అన్నారు. ఎవరెవరికి, పార్టీలకు ఎంత ఇచ్చారో లెక్క తేలాలని నారాయణ పేర్కొన్నారు. కార్పొరేట్ కంపెనీలు ఇచ్చిన లెక్కలు చెప్పాల్సిందే.. పారదర్శకత ఉండాల్సిందేనని నారాయణ తెలిపారు.
Nirmal: బ్లాక్ మెయిలర్లు, చీటర్లు కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు.. కాంగ్రెస్ నేతల నిరసన
Also Read
- Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. పలు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు!
- Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
- Pakistan Afghanistan Conflict: అర్ధరాత్రి ఆఫ్గానిస్థాపై పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్స్.. ఇళ్లపై బాంబులు వర్షం..!
- Sandeep Patil: రోహిత్, కోహ్లీ లేకపోయినా టీమిండియాకు నష్టమేమీ లేదు.. మాజీ సెలెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
దొంగలను, రాజకీయ పార్టీలను కాపాడేందుకు చేసే ప్రయత్నం సరికాదని నారాయణ ఆరోపించారు. లెక్కలు ఇవ్వని అధికారులను విచారణ చేసి జైల్లో వేయాలని పేర్కొన్నారు. అధికారుల వెనుక కేంద్ర పెద్దలున్నారు.. ప్రధాని, కేంద్ర హోంమంత్రి బాధ్యత వహించాలని తెలిపారు. రాజకీయాలను ధ్వంసం చేసేందుకే ఎలక్ట్రోరల్ బాండ్లను తీసుకొచ్చారు.. క్విడ్ ప్రో కో లాభపడిన అందరి వివరాలు బయటకు రావాలని ఆయన కోరారు.
Palle Sindhura Reddy: తొలిరోజు ప్రచారంలోనే టీడీపీ అభ్యర్థికి అస్వస్థత..
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. ఎస్‌బీఐ అందజేసిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఈసీ తన వెబ్‌సైట్‌లో ఉంచింది. అయితే, ఆ వివరాల్లో ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసిన కొన్ని సంస్థలపై గతంలో సీబీఐ, ఈడీ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేశాయనే అంశం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. డేటా ప్రకారం, రాజకీయ పార్టీలకు అత్యధికంగా విరాళం ఇచ్చిన మొదటి 30 కంపెనీల్లో 15 కంపెనీలకు పైగా ఈడీ, సీబీ, ఆదాయ పన్ను శాఖల నుంచి దర్యాప్తును ఎదుర్కొన్నాయి.
తాజావార్తలు
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. పలు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు!
-
The Paradise: టైటిల్లోనే కాదు.. ‘పుష్ప’, ‘పెద్ది’, ‘ప్యారడైజ్’ కథల్లోనూ ఒకే కనెక్షన్.. సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా ?
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Pakistan Afghanistan Conflict: అర్ధరాత్రి ఆఫ్గానిస్థాపై పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్స్.. ఇళ్లపై బాంబులు వర్షం..!
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!