టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు త్వరలో ప్రజల్లోకి వెళ్ళనున్నారు. ప్రజా గళం పేరుతో ప్రజల్లోకి విస్తృత పర్యటనలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న సభకు పెట్టిన పేరుతోనే ప్రజల్లోకి టీడీపీ అధినేత వెళ్లనున్నారు.
ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు నాలుగు దశల్లో జరగనుండగా, మే 13 (సోమవారం), మే 20 (సోమవారం), మే 25 (శనివారం), జూన్ 1 (శనివారం) తేదీల్లో పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం (ఈసీ) ఈరోజు ప్రకటించింది.
కేంద్ర ఎన్నికల సంఘం పార్లమెంట్ తో పాటు, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను శనివారం విడుదల చేయనున్నట్లు తెలిపింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం విజ్ఞాన్ భవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు విలేకరుల సమావేశంలో ఈ ప్రకటన చేస్తామని తెలిపింది. లోక్ సభతో పాటు ఐదు రాష్ట్రాలు.. ఆంధ్ర ప్రదేశ్, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల పూర్తి స్థాయి షెడ్యూల్ ను విడుదల చేసే అవకాశం ఉంది.
మునుపెన్నడు లేని విధంగా రికార్డులు తిరగరాస్తు 50 వేల మెజార్టీతో గెలిపిస్తామని ఉదయగిరి ముస్లిం మైనార్టీ సోదరులు మహిళలు కాకర్ల సురేష్ కు భరోసా ఇచ్చారు. వింజమూరు మండల కేంద్రంలోని బొమ్మ రాజుచెరువు సమీపంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉదయగిరి ముస్లిం మైనార్టీ మహిళలు ముస్లిం సోదరులు సుమారు 500 మంది టిడిపి పార్టీలో ఉదయగిరి ఇంచార్జ్ కాకర్ల సురేష్ సమక్షంలో ఆదివారం చేరారు. ఈ సందర్భంగా ముస్లిం నేతలు మాట్లాడుతూ.. 50వేల మెజార్టీ మెజారిటీతో ఉదయగిరి…
రానున్న ఎన్నికల్లో పోటీపై మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ జీవితానికి విశ్రాంతి అవసరమనిపిస్తోందని అన్నారు. కానీ.. పార్టీ కోసం పనిచేస్తానని సీఎం జగన్ కు చెప్పానని తెలిపారు. కాగా.. ఈసారి పోటీలో ఉండాలని సీఎం అంటున్నారు.. పార్టీ కష్టకాలంలో వదిలేసానని అపవాదు తనపై రాకూడదని చెప్పారు. మూడు రోజుల క్రిందట తాను ముఖ్యమంత్రిని కలిసానని.. ఈసారి తనను ఎంపీకి పోటీ చేసి తమ బాబుని అసెంబ్లీకి పంపిద్దామని తనతో సీఎం చెప్పినట్లు తెలిపారు.
ఎన్నికల సమయంలో చాలా మంది రాజకీయ నేతలు టికెట్ల కోసం పార్టీల చుట్టూ తిరుగుతుంటారు. ప్రజాసేవ చేసేందుకు ఉవ్విళ్లూరుతుంటారు. తమకు టికెట్ ఇస్తే కచ్చితంగా గెలిచి వస్తామని పార్టీ అధినేతలకు చెప్తుంటారు. ఇప్పుడు అనకాపల్లిలో కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ప్రముఖ పారిశ్రామిక వేత్త ముత్యాల వెంకటేశ్వర రావు (ఎంవీఆర్) ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇన్నాళ్లూ పలు పార్టీలు ఆయన్ను రాజకీయాల్లోకి రావాలని కోరాయి. కానీ ఎంవీఆర్ అంగీకరించలేదు. ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి…