ఇప్పుడు దేశ ప్రజలందరి చూపు తెలంగాణ సీఎం కేసీఆర్ పైనే ఉంది.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేం సిద్ధంగా ఉన్నామని తెలిపారు ప్రభుత్వ ఛీఫ్ విప్ వినయ్ భాస్కర్.. హనుమకొండ జిల్లా మడికొండలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం జరిగింది.. ఈ సమ్మేళనంలో చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్, కార్పొరేటర్లు, ఇతర నేతలు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మా…
ఏపీలో ఇంకా ఎన్నికల మూడ్ రాకుండానే పొత్తుపొడుపులు ప్రారంభం అయ్యాయి. వైసీపీని ఓడించేందుకు ఇతర పార్టీలు కలిసి రావాలని ఈమధ్యే మాజీ సీఎం చంద్రబాబు వాకృచ్చారు. చంద్రబాబు కామెంట్లపై మండిపడ్డారు వైసీపీ నేతలు. మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు సొంత పార్టీపై నమ్మకం లేదు. ప్రతీ ఎన్నికల సమయంలో అందుకే ఇతర పార్టీలతో చంద్రబాబు పొత్తులు పెట్టుకుంటారన్నారు బాలినేని. పొత్తుల కోసం వెంపర్లాడుతున్నప్పుడే సీఎం జగన్ ఎదుర్కొనలేక పోతున్నారని…
రాష్ట్రం లో జగన్ పరిపాలనలో అన్ని వర్గాలు మోసపోయాయన్నారు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు.గుంటూరులో ఆయన మాట్లాడుతూ జగన్ మాయ మాటలకు మహిళలు, కార్మికులు, ఉపాధ్యాయులు అందరూ దారుణంగా మోసపోయారన్నారు. ప్రభుత్వం చేసిన మోసాలపై ప్రశ్నిస్తే కేసులు పెట్టి గొంతు నొక్కేస్తున్నారని విమర్శించారు. మహిళలకు భద్రత లేకుండా పోయిందన్నారు. వరుసగా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. మహిళా కమిషన్ ను అడ్డు పెట్టుకుని ప్రతి పక్ష నేత చంద్రబాబును భయపెట్టే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. మాజీ…
సోనియా గాంధీ నివాసంలో కీలక భేటీ ముగిసింది. సుమారు 6 గంటలపాటు నేతల మధ్య సమాలోచనలు సాగాయి. వచ్చే రెండు, మూడు రోజుల్లో చర్చలు, సమాలోచనలు పూర్తవుతాయని కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా తెలిపారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన ప్రతిపాదనలతో పాటు, సంస్థాగతంగా, పాలనాపరంగా అనుభవం ఉన్న ఇద్దరు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్, భూపేశ్ భగేల్ అభిప్రాయాలను కూడా తీసుకోవడం జరిగిందన్నారు. ప్రజల ఆశలకు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు…
ఏపీలో జగన్ సర్కార్ తీరుపై బీజేపీ నేతలు అస్త్రాలు ఎక్కుపెడుతూనే వున్నారు. ఏపీలో దిశ, దశ లేని ప్రభుత్వం పాలన చేస్తుందన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే.. ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీ, జనసేన మాత్రమే. రెండు నెలల క్రితమే అమిత్ షా మాకు ఈ విషయం పై దిశానిర్దేశం చేశారు. వలంటీర్ వ్యవస్థతో ప్రజాస్వామ్య వ్యవస్థను సీఎం నాశనం చేశారు. ఈ వాలంటీర్ వ్యవస్థకి ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీ ద్వారా…
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఏ విషయం మీదనైనా చాలా వ్యంగ్యంగా మాట్లాడతారు. తనదైన రీతిలో స్పందిస్తూ వుంటారు. ఆయన రూటే సపరేటు. అంతా వివిధ సమస్య గురించి మాట్లాడితే.. మొన్నామధ్య బిగ్ బాస్ గురించి విమర్శలు చేశారు. తిరుపతిలో నారాయణ ఏపీ రాజకీయాలపై స్పందించారు. వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చును అన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు స్వాగతిస్తున్నా అన్నారు. బీజేపీ ఎలా వైసీపీకి వ్యతిరేకంగా రోడ్ మ్యాప్ ఇస్తుంది. వైసీపీ, బీజేపీలు లివింగ్ టు గెథర్…