తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (టీఆర్ఎస్) పేరును భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)గా మార్చడం లాంఛనమే అంటున్నారు.. టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి)గా మారుస్తూ దసరా రోజు ఆ పార్టీ నేతలు తీర్మానం చేసిన విషయం తెలిసిందే కాగా.. ఆ తీర్మానం కాపీని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి అందజేశారు పార్టీ ప్రతినిధులు.. పార్టీ పేరు మార్పుపై అభ్యంతరాల స్వీకరణకు గడువు ఈ నెల 6వ తేదీతో ముగిసిపోయింది.. దీంతో ఏ క్షణంలోనైనా ఈసీ నుంచి బీఆర్ఎస్ పై ప్రకటన వచ్చే అవకాశం ఉందని పార్టీ అధినేత కేసీఆర్ సహా పార్టీ శ్రేణులంతా ఎదురుచూస్తున్నారు.. ఈ సమయంలో.. అసలు బీఆర్ఎస్ పార్టీకి అనుమతి ఇస్తే ఆదినాకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు వరంగల్ జిల్లా నర్సంపేట్ నియోజకవర్గానికి చెందిన ఓ యువకుడు..
Read Also: RBI: గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్బీఐ.. వాటికోసం ఇక బ్యాంక్‌కు వెళ్లాల్సిన అవసరంలేదు..
భారతీయ రాష్ట్ర సమితి పార్టీ పేరు తనకు కేటాయించాలని సెప్టెంబర్ 5వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నానని ఆధారాలు చూపుతున్నారు బానోత్ ప్రేమ్ గాంధీ నాయక్ అనే యువకుడు.. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మారుస్తూ ఎప్పుడైనా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోన్న సమయంలో.. అసలు ఆ పేరు నాకే కేటాయించాలని మరోసారి ఎలక్షన్ కమిషన్‌కి ఫిర్యాదు చేశారు.. భారతీయ రాష్ట్ర సమితి పార్టీ పేరు తనకు కేటాయించాలని సెప్టెంబర్‌లోనే దరఖాస్తు చేశాను.. ఫస్ట్ కమ్ ఫస్ట్ గెట్ ప్రకారం… బీఆర్ఎస్ తనకే ఇవ్వాలంటూ ఈ నెల 6వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.. (ఎఫ్ నంబర్ 56/164/2022/పీ.పీ.ఎస్-4) నెంబర్ కోడ్ లేఖను ఈసీకి పంపారు ప్రేమ్ నాయక్… బీఆర్‌ఎస్ పార్టీ పేరు గనక తనకు కేటాయించకపోతే న్యాయపోరాటం చేస్తానని ప్రకటించారు ప్రేమ్ నాయక్. మరి, కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ లేఖను పరిగణనలోకి తీసుకుంటుందా? అసలు బీఆర్ఎస్‌పై ఎప్పుడు ప్రకటన చేస్తుంది. అనేది ఉత్కంఠగా మారింది.