సచివాలయంలో ఎన్నికల ప్రధానాధికారిని కలిశారు టీడీపీ నేత వర్ల రామయ్య. వాలంటీర్ల వ్యవస్థను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని సీఈవో ముఖేష్ కుమార్ మీనాకు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ల ఉద్యోగాలు తీసేస్తారు అంటూ అబద్ధపు ప్రచారం చేస్తున్నారు.టీడీపీ అధికారంలోకి వస్తే వలంటీర్ల ఉద్యోగాలు చంద్రబాబు తీసేయ్యరు.వలంటీర్లకు టీడీపీ అధికారంలోకి రాగానే మెరుగైన రీతిలో వారికి ప్రోత్సాహకాలు కల్పిస్తాం.వలంటీర్లకు టీడీపీ అధికారంలోకి రాగానే ఉద్యోగ భద్రత ఉంటుందని వర్ల రామయ్యగా నేను ఇస్తున్న హామీ కాదు చంద్రబాబు నిర్ణయాన్ని నేను చెప్తున్నాను.
Read Also: Unstoppable: మీరు ఎన్నడూ చూడని ఎంటర్టైన్మెంట్ రెడీ అవుతోంది…
రాష్ట్రంలో వైసీపీ వాలంటీర్ల వ్యవస్థను దుర్వినియోగం చేస్తుంది అనేది ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళాం.వైసీపీ ప్రభుత్వానికి సిగ్గు లేదు.ఏ కులం వారు ఎంత మంది ఉన్నారు అనేది వలంటీర్ల ద్వారా వైసీపీ ఎమ్మెల్యేలు తెలుసుకుంటున్నారు.ఒక్కో ఇంట్లో ఏ కులం వారు ఎంత మంది ఉన్నారు..? ఎస్సీలు ఎంత మంది ఉన్నారు అనేది వాలంటీర్లను లెక్కించమని ప్రభుత్వం ఒత్తిడి చేస్తుంది.వలంటీర్లను ఇంట్లో పని వాళ్ళలా చూస్తున్నారు.వలంటీర్లను ఎన్నికల విధుల్లోకి వాడటానికి వీల్లేదని ఎన్నికల సంఘం చెప్తున్నా వారిని భయపెట్టి వారితో కొన్ని పనులు చేయిస్తున్నారు.వలంటీర్ల వ్యవస్థను ప్రభుత్వం ఏ విధంగా దుర్వినియోగం చేస్తుందనేది ఎన్నికల సీఈవో ముఖేష్ కుమార్ మీనా దృష్టికి తీసుకెళ్లాం అన్నారు వర్ల రామయ్య.
Read Also: Crime News: డామిట్ కథ అడ్డం తిరిగింది.. మ్యాట్రిమోని మోసగాడి తిక్క కుదిరింది