Election Commission: ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఎగ్జిట్, ఒపీనియన్ పోల్స్‌పై నిషేధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Election Commission: హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌లలో విధానసభ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్, ఒపీనియన్ పోల్స్‌ను భారత ఎన్నికల సంఘం నిషేధించింది. హిమాచల్ ప్రదేశ్‌లోని 68 అసెంబ్లీ స్థానాలకు శనివారం గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లో డిసెంబర్ 1, 8 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది.నవంబర్ 12వ తేదీ ఉదయం 8 గంటల నుంచి, డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఎగ్జిట్ పోల్ అంచనాలను ప్రచురించడాన్ని నిషేధిస్తూ పోల్ ప్యానెల్ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది.
నోటిఫికేషన్ ప్రకారం, ఎలక్ట్రానిక్ మీడియాలో ఒపీనియన్ పోల్ ఫలితాలు లేదా మరేదైనా పోల్ సర్వేతో సహా ఏదైనా ఎన్నికల విషయాలను ప్రదర్శించడం, ముగింపుకు నిర్ణయించిన గంటలతో ముగిసే 48 గంటలలో నిషేధించబడుతుందని ఎన్నికల విభాగం ప్రతినిధి తెలిపారు.‘‘ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 126Aలోని సబ్-సెక్షన్ (ఎల్) కింద ఉన్న అధికారాలను వినియోగించుకుంటూ భారత ఎన్నికల సంఘం నవంబర్ 12 ఉదయం 8 గంటల నుంచి డిసెంబర్ 5 సాయంత్రం 5.30 గంటల మధ్య వ్యవధిలో ఏదైనా ఎగ్జిట్ పోల్ నిర్వహించడం, ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచురించడం లేదా ప్రసారం చేయడం, ఏదైనా ఎగ్జిట్ పోల్ ఫలితాలను నిషేధించారు’’ అని ఈసీ నోటిఫికేషన్ లో పేర్కొంది.
Also Read
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
Himachal Pradesh Congress Chief: 40-45 స్థానాల్లో గెలుస్తాం.. ఈ సారి ప్రభుత్వం మాదే..
ఈ సలహాను గెజిట్ నోటిఫికేషన్ రూపంలో తెలియజేయాలని, రికార్డు కోసం కమిషన్‌కు కాపీని పంపాలని హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ముఖ్య ఎన్నికల అధికారులను కూడా ఈసీ ఆదేశించింది. అన్ని న్యూస్ బ్యూరోలు, మీడియా సంస్థలు, రేడియో, టెలివిజన్ ఛానెల్‌లకు ఈ నోటిఫికేషన్ గురించి తెలియజేయాలని సంబంధిత అధికారులకు సూచించబడింది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం గురువారం ముగియగా.. ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ తీవ్ర పోటీలో నిమగ్నమై ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బలమైన పనితీరును కనబరిచేందుకు ప్రయత్నిస్తున్నాయి. పార్టీలకతీతంగా మొత్తం 412 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రభుత్వ కార్యాలయాలు, బోర్డులు, కార్పొరేషన్లు, విద్యా సంస్థలు, పారిశ్రామిక సంస్థల ఉద్యోగులకు పోలింగ్ రోజున రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. రెండు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 8న జరగనుంది.
తాజావార్తలు
-
CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Rahul Gandhi’s SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
-
Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
-
WhatsApp Scam Alert: వాట్సాప్‌లో ‘YES’ లేదా ‘NO’ అని పంపితే డబ్బులు మాయం.?
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!