Congress vs BJP: డికె శివకుమార్ నామినేషన్‌కు ఆమోదం.. కనకపురలో హైవోల్టేజీ పోటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగిసింది. అభ్యర్థులు పోటాపోటిగా ప్రచారం చేస్తున్నారు. ఇక, ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ నామినేషన్‌ను ఈసీ ఆమోదించింది. కనకపుర అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డికె శివకుమార్ నామినేషన్‌ను ఎన్నికల సంఘం శుక్రవారం ఆమోదించింది. ఆయనకు పోటీగా బిజెపికి చెందిన రెవెన్యూ మంత్రి ఆర్ అశోక రంగంలో దిగారు. ఇద్దరి మధ్య మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కనకపుర నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన డీకే శివకుమార్ తన మద్దతుదారుల బలప్రదర్శన మధ్య సోమవారం నామినేషన్ దాఖలు చేశారు.
Also Read: Godhra Case: సబర్మతి ఎక్స్‌ప్రెస్‌కు నిప్పు.. 8 మంది దోషులకు బెయిల్
డీకె శివకుమార్ మనీలాండరింగ్, పన్ను ఎగవేత కేసులకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి), ఆదాయపు పన్ను (ఐటి) డిపార్ట్‌మెంట్ విచారణలను ఎదుర్కొంటున్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రతీకారానికి పాల్పడుతోందని ఆరోపించారు.ఈ నేపథ్యంలో ఆయన నామినేషన్ రద్దు చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ముందు జాగ్రత్త చర్యగా గురువారం ఆయన సోదరుడు బెంగళూరు రూరల్ ఎంపీ డీకే సురేష్ కూడా అదే నియోజకవర్గానికి బ్యాకప్ అభ్యర్థిగా తన పత్రాలను దాఖలు చేశారు. అయితే, డికె శివకుమార్ నామినేషన్ ను ఈసీ ఆమోదించడంతో ఆయన పోటీలో ఉండడం ఖాయం అయింది. ఇక, బీజేపీ కనకపుర నుంచి మంత్రి ఆర్.అశోకను పోటీకి దింపింది. వొక్కలిగ సామాజిక వర్గానికి చెందిన అశోక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు సన్నిహితుడిగా ఉన్నాడు.
Also Read:Srinagar Tulip Garden: కొత్త పర్యాటక రికార్డును సృష్టించిన శ్రీనగర్‌లోని తులిప్ గార్డెన్
Also Read
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
కనకపుర నియోజవకర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. 2004 నుండి 2008 వరకు జనతాదళ్-సెక్యులర్ (జెడి-ఎస్) చేతిలో ఉన్న కొద్దికాలం మినహా 1989 నుండి కాంగ్రెస్ ఈ స్థానాన్ని గెలుచుకుంది. మే 10న జరగనున్న ఎన్నికల్లో కనకపురలో అత్యంత హైవోల్టేజీ పోటీ ఒకటిగా భావిస్తున్నారు. మే 13న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?