Easy Way To Check Your Name In Voter List: ఇంతకుముందు ప్రభుత్వ ఆధారిత సేవల కోసం.. ఆయా సంబంధిత కార్యాలయాలకు తప్పకుండా వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. అయితే.. కాలక్రమంలో వృద్ధి చెందుతున్న టెక్నాలజీ పుణ్యమా అని, ఇప్పుడు ఆ సేవలన్నీ ఇంకా సులభతంగా మారుతున్నాయి. కార్యాలయాలకు వెళ్లాల్సిన పని లేకుండా, ఇంట్లో కూర్చొనే ఆ పనుల్ని ముగించుకునే సౌలభ్యం క్రమంగా అందుబాటులోకి వస్తోంది. ఇందులో భాగంగానే.. ఓటరు జాబితాలో మీ పేరుని వెరిఫై చేసుకోవడానికి, ఇంట్లోనే సులభంగా చెక్ చేసుకోవచ్చు. అయితే.. ఇందుకోసం తప్పనిసరిగా ఓటరు ID లేదా దాని EPIC నంబర్ మీ వద్ద ఉండాలి. అలాగే.. మీ నంబర్‌ను ఆధార్ లేదా ఓటర్ ఐడీకి లింక్ చేయాలి. ఓటర్లందరికీ భారత ఎన్నికల సంఘం.. ఎలక్టర్ల ఫోటో గుర్తింపు కార్డు లేదా EPIC నంబర్‌ను జారీ చేస్తుంది. ఇది వ్యక్తి ఓటర్ ID కార్డ్‌లో ఉంటుంది. వారి ప్రత్యేక EPIC నంబర్ ద్వారా.. ఓటరు జాబితాలో తమ పేర్లను చెక్ చేసుకోవచ్చు.
Chandrika Saha: 15 నెలల పిల్లాడ్ని నేలకేసి కొట్టిన తండ్రి.. భార్య ఆ పని చేయలేదన్న కోపంతోనే..
ఓటరు జాబితాలో మీ పేరు ఉందా? లేదా? అని చెక్ చేసుకోవడానికి.. ముందుగా మీరు ఓటరు అధికారిక వెబ్‌సైట్ ‘nvsp’కి వెళ్లాలి. అనంతరం ఆ వెబ్‌సైట్‌లో ఎలక్టోరల్ రోల్‌లోని సెర్చ్‌పై క్లిక్ చేసి.. అందులో మీ పేరు, చిరునామా, వయస్సు, EPIC నంబర్, మొబైల్ నంబర్, నియోజకవర్గం వంటి మీ వివరాలను నమోదు చేయాలి. మొత్తం వివరాల్ని పొందుపరిచాక సెర్చ్ బటన్‌పై క్లిక్ చేస్తే.. మీ ప్రాంతానికి చెందిన ‘ఓటరు జాబితా’ మీ ముందు విండోలో కనిపిస్తుంది. అక్కడ మీరు మీ పేరునొ కనుగొనవచ్చు. ఒకవేళ ఎవరికైనా తమ EPIC నంబర్ తెలియకపోతే.. వారు తమ పేరు, పుట్టిన తేదీ, అసెంబ్లీ నియోజకవర్గం వంటి వారి వ్యక్తిగత వివరాల ద్వారాతోనూ ఓటరు జాబితాలో తమ పేరును చూసుకోవచ్చు.
Illegal registration : రైతుబంధు ఇప్పిస్తానని చెప్పి.. నానమ్మ భూమి కాజేసిన మనవడు