Telangana BJP : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడంపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్, మర్రి శశిధర్ రెడ్డితో పలువురు బీజేపీ ప్రతినిధులు ఎన్నికల అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కోడ్ ఉల్లంఘించారని ఆరోపించారు. ఇలా మంత్రి పదవి ఇవ్వడం…
Telangana BJP : కాంగ్రెస్ నేత అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వనున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ ఇవ్వనందుకు ఆయనకు ఏకంగా మంత్రి పదవే ఇస్తున్నారు. రేపు అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణం చేయబోతున్నాడు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వడంపై బీజేపీ ఫైర్ అయింది. అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడంపై బీజేపీ నేడు ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయబోతోంది. ఉదయం 11 గంటలకు ఎలక్షన్ కమిషన్ ను…
ఎన్నికల సంఘం SIR రెండవ దశను ప్రకటించింది. బీహార్ తరువాత, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఇప్పుడు 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రారంభం కానుంది. వీటిలో అండమాన్, నికోబార్ దీవులు, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. ఓటర్లు SIR కోసం సమర్పించాల్సిన పత్రాల జాబితాను కూడా ఎన్నికల సంఘం విడుదల చేసింది. మీ వద్ద ఈ పత్రాలు ఉంటే, మీరు వాటిని మీ…
కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా ఓటరు సమగ్ర సవరణ (Special Intensive Revision-SIR) చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టింది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బోగస్ ఓట్ల నమోదుపై హైకోర్టులో జరిగిన విచారణ ముగిసింది. ఈ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఓటు చోరీ వ్యవహారంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్ లో జరిగిన ప్రత్యేక సమావేశంలో బీఆర్‌ఎస్ కేటీఆర్ ఓటు చోరీ అంశంపై పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇచ్చారు.
Jubilee Hills By Poll : హైదరాబాద్ మహానగరం పరిధిలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ సోమవారం (అక్టోబర్ 13) విడుదల చేయనుంది. నామినేషన్ల సమర్పణ అక్టోబర్ 13 నుంచి 21 వరకు కొనసాగుతుంది, ఈ వ్యవధిలో ప్రభుత్వ సెలవు దినాలను మినహా అన్ని రోజుల్లో అభ్యర్థులు తమ నామినేషన్లను షేక్ పేట్ ఎమ్మార్వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ ఆఫీస్‌లో సమర్పించవచ్చు. ఎన్నికల అధికారులు నామినేషన్ల ప్రక్రియ సక్రమంగా…
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా జరుగనున్న MPTC, ZPTC ఎన్నికలపై జారీ చేసిన గెజిట్ను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు మేరకు సెప్టెంబర్ 29న విడుదల చేసిన ఎన్నికల నోటిఫికేషన్ను తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. Hyderabad Drugs: రూటు మార్చిన డ్రగ్ స్మగ్లర్లు.. కొంపలోనే కుంపటి పెట్టారు! హైకోర్టు ఆదేశాలు అందిన వెంటనే ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ ఎన్నికల కమిషన్ గెజిట్…
బీహార్ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు కీలక సూచనలు చేసింది. ఏఐ-జనరేటెడ్ వీడియోలను దుర్వినియోగం చేయవద్దని రాజకీయ పార్టీలను హెచ్చరించింది. ఎన్నికల వాతావరణం కలుషితం కాకుండా సోషల్ మీడియా పోస్టులపై కఠినమైన నిఘా ఉంచినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఎన్నికల అధికారులు ఈరోజు, రేపు బీహార్‌లో పర్యటించనున్నారు.