KTR : ఈ ఫేక్ ఓటర్లలో మైనర్లు కూడా.. కీలక విషయాలు వెల్లడించిన కేటీఆర్
- తెలంగాణ భవన్ లో ఓటు చోరీ అంశంపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రెసెంటేషన్
- జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ అడ్డదారులు తొక్కుతుంది..
- కాంగ్రెస్ ఎన్ని అడ్డదారులు తొక్కినా గెలిచేది మాత్రం బీఆర్ఎస్.. పూర్తి ఆధారాలతో చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కి వినతి పత్రం ఇచ్చాను : కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఓటు చోరీ వ్యవహారంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్ లో జరిగిన ప్రత్యేక సమావేశంలో బీఆర్‌ఎస్ కేటీఆర్ ఓటు చోరీ అంశంపై పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ అడ్డదారులు తొక్కుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ ఎన్ని అడ్డదారులు తొక్కినా గెలిచేది మాత్రం బీఆర్ఎస్సే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పూర్తి ఆధారాలతో చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కి వినతి పత్రం ఇచ్చానని, గత అసెంబ్లీ ఎన్నికల్లో 3 లక్షల 75 వేల ఓటర్లు ఉండగా.. ఇప్పుడు 3 లక్షల 98 వేల ఓట్లు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు.
ఏపీ కల్తీ లిక్కర్ కేసులో సంచలన పరిణామాలు..! వేడెక్కిన జోగి రమేష్, జనార్ధన్ రావు వివాదం
Also Read
- TG SAFE: హైదరాబాద్లో అక్రమ డైరీ దందా గుట్టురట్టు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- Congress Councillors: కాంగ్రెస్కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
అంతేకాకుండా.. అసాధారణంగా 23 వేల ఓట్లు ఎలా పెరిగాయని, మొన్న కాంగ్రెస్ పార్టీ తరుపున నవీన్ యాదవ్ ఓటర్ ఐడి లు పంచాడని, ఓటర్ ఐడీ పంచే అధికారం అతనికి ఎవరు ఇచ్చారని ఆయన అన్నారు. అవన్నీ ఫేక్ ఓటర్ ఐడీ కార్డ్స్ అని ఎన్నికల అధికారులు అంటున్నారన్నారు. అతనిపై ఎన్నికల అధికారులు కేసు కూడా నమోదు చేశారని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ఫేక్ ఓటర్లలో మైనర్లు కూడా ఉన్నారని కేటీఆర్ వెల్లడించారు. సంస్కృతి ఆపాట్మెంట్ లో 43 ఓటర్లు ఉన్నారని, కానీ అక్కడికి వెళ్లి ఎంక్వయిరి చేస్తే.. వాళ్లెవరు అక్కడ లేరని చెబుతున్నారన్నారు. ఇదేకాకుండా.. మరొక చోట బూత్ నెంబర్ 125 లో ఒకటే అడ్రెస్స్ లో 23 ఓట్లు ఉన్నాయని, అక్కడ కూడా ఈ 23 మంది ఎవరో అక్కడి వాళ్లకు తెలియదు అని చెబుతున్నారన్నారు. ఆ ఇంటి యజమానికి కూడా వాళ్లెవ్వరో తెలియదు అని సమాధానం ఇస్తున్నారన్నారు. ఇవ్వన్నీ ఫేక్ ఓట్లు అని కేటీఆర్ అన్నారు. 118 ఇంటి నెంబర్ కాంగ్రెస్ పార్టీ నేత ఇంటి అడ్రస్‌పై 32 ఫేక్ ఓటర్ ఐడీలు ఉన్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Siddu Jonnalagadda: అందరిలా కాదు.. మా ట్రైలర్ కంటెంట్ అంతా సినిమాలోనూ ఉంటుంది!
తాజావార్తలు
-
Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
-
Anupama: ‘పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది!’.. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖలు
-
Pakistan: పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 21 మంది విద్యార్థులు, టీచర్ మృతి
-
Anupama: హైదరాబాద్లో ఇల్లు కట్టుకుంటున్న అనుపమ
-
TG SAFE: హైదరాబాద్లో అక్రమ డైరీ దందా గుట్టురట్టు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!