High Court Telangana : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బోగస్ ఓట్ల నమోదుపై హైకోర్టులో జరిగిన విచారణ ముగిసింది. ఈ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు విచారణలో బోగస్ ఓట్లపై విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం (EC) సమాధానం ఇచ్చింది. దీనిపై స్పందించిన హైకోర్టు, ఈసీ ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని, అందువల్ల ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
Nimisha Priya: కేరళ నర్సు నిమిషా ప్రియ మరణశిక్షపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య
అదే సమయంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కోర్టు జోక్యం చేసుకోలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎన్నికల నిర్వహణపై ఉన్న అధికారాలు పూర్తిగా ఎన్నికల సంఘానికే చెందినవని కోర్టు తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలోని బోగస్ ఓట్లపై ఎన్నికల సంఘం స్వతంత్రంగా చర్యలు చేపట్టనుంది.
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో రకుల్, సమంత, తమన్నాలకు ఓటర్ కార్డు?