Telangana BJP : కాంగ్రెస్ నేత అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వనున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ ఇవ్వనందుకు ఆయనకు ఏకంగా మంత్రి పదవే ఇస్తున్నారు. రేపు అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణం చేయబోతున్నాడు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వడంపై బీజేపీ ఫైర్ అయింది. అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడంపై బీజేపీ నేడు ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయబోతోంది. ఉదయం 11 గంటలకు ఎలక్షన్ కమిషన్ ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్టు బీజేపీ ప్రకటించింది. ఒక వర్గం ఓట్ల కోసమే అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తున్నారని ఆరోపించారు.
Read Also : Nagarjuna Sagar Project : నాగార్జున సాగర్ 20 గేట్లు ఎత్తిన అధికారులు..
అజారుద్దీన్ గతంలో జూబ్లీ హిల్స్ నియోజక వర్గం నుండి పోటీ చేశారు. అందుకే ఆ ఓట్లను ప్రభావితం చేసేందుకే ఆయనకి మంత్రి పదవి అని బీజేపీ చెబుతోంది. పాయల్ శంకర్, మర్రి శషిధర్ రెడ్డి, ఆంటోనీ రెడ్డితో పాటు మరికొందరు వెళ్లి ఈసీని కలవనున్నారు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. జూబ్లీహిల్స్ లో బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్ లో ముస్లిం ఓటర్లు ప్రభావితం చేసే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో అజరుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చారంటున్నారు బీజేపీ నేతలు.
Read Also : CM Revanth Reddy : మొంథాపై కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ..