Ponnam Prabhakar : కేటీఆర్‌పై సుమోటోగా కేసు నమోదు చేయాలి
- కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం
- ఎన్నికల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్
- ప్రజలతో అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలు వెల్లడించిన మంత్రి
- జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా ప్రచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేడి రోజురోజుకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. పది సంవత్సరాల పాలనలో అక్రమంగా సంపాదించిన అహంతో, ఓటర్లను కొనుగోలు చేసే ప్రయత్నం చేయడం తగదని ఆయన విమర్శించారు. “ఓటు కి 5 వేల రూపాయలు అడుక్కోండి అని చెప్పడం అక్షేపణీయం” అని వ్యాఖ్యానించిన ఆయన, ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ సుమోటోగా తీసుకుని కేటీఆర్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… “హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటుకు ఆరు వేలు ఇచ్చిన సంస్కృతి కేటీఆర్‌దే. ఇప్పుడు అదే పద్ధతిలో జూబ్లీహిల్స్‌లో ప్రయత్నిస్తున్నారు. కానీ జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచన కలిగినవారు. వారు డబ్బు రాజకీయాలకు లోనుకావు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో మాదిరిగానే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపిస్తారు” అని విశ్వాసం వ్యక్తం చేశారు.
Also Read
- OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
- Off The Record: వరంగల్ జిల్లా బీఆర్‌ఎస్ నేతల్లో నర్సంపేట టెన్షన్ .. ఎందుకంటే ?
- Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
“మా ప్రభుత్వం ప్రజా పాలన ప్రభుత్వంగా పనిచేస్తోంది. ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచనతోనే పథకాలు అమలు చేస్తున్నాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కి గ్యాస్, నూతన రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీ లేని రుణాలు, కొత్త ఉద్యోగాల కల్పన.. ఇవన్నీ మా నిబద్ధతను ప్రతిబింబిస్తాయి,” అని తెలిపారు.
అంతేకాకుండా, హైదరాబాద్ అభివృద్ధి కోసం ప్రభుత్వం డ్రింకింగ్ వాటర్, డ్రైనేజీ, రోడ్లు, మౌలిక వసతులపై భారీగా ఖర్చు చేస్తోందని వివరించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ కుమ్మక్కయి కాంగ్రెస్‌ను ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తున్నాయని మంత్రి ఆరోపించారు. “బీజేపీ మూడు అంకెలు దాటని వ్యక్తిని అభ్యర్థిగా పెట్టింది. మీరు బీజేపీకి వేసిన ఓటు బీఆర్‌ఎస్‌కే వెళ్తుంది, బీఆర్‌ఎస్‌కి వేసిన ఓటు బీజేపీకే వెళ్తుంది. అందుకే జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించండి” అని ఆయన పిలుపునిచ్చారు.
DVV Entertainments : ప్రశాంత్ వర్మ అడ్వాన్స్’ల పంచాయితీ.. మాకేం సంబంధం లేదన్న డీవీవీ
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!