Akhilesh Yadav: బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సంచలన విజయం నమోదు చేసింది. 243 సీట్లు ఉన్న బీహార్‌లో ఏకంగా 200+ పైగా సీట్లను సాధించే దిశగా వెళ్తోంది. ఆర్జేడీ-కాంగ్రెస్-కమ్యూనిస్టుల కూటమి ‘‘మహాఘట్బంధన్’’ తుడిచిపెట్టుకుపోయింది. కేవలం 30 స్థానాల్లోనే ఆధిక్యత కనబరుస్తోంది.
Bihar Election Results: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించబోతోంది. ఎవరూ ఊహించని విధంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మించి విజయం దిశగా వెళ్తోంది. బీజేపీ, జేడీయూ, ఎల్జేపీల జోడీ బంపర్ హిట్ అయింది. మరోవైపు, కాంగ్రెస్, ఆర్జేడీల కూటమి చతికిత పడింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో ఎన్డీయే కూటమి 190 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, మహాఘట్బంధన్ కూటమి 50 సీట్ల లోపు పరిమితమైంది.
BJP: తెలంగాణలో ఉత్కంఠ రేకెత్తిస్తున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారంకు నేడు తెరపడనుంది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి గడువు ముగియనుంది. సాయంత్రం 5 తర్వాత మైకులు, నేతల ప్రచారాలు బంద్ కానున్నాయి. సాయంత్రం నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆంక్షలు మొదలుకానున్నాయి.
West Bengal: పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితాపై స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) కొనసాగుతున్న సమయంలో, బుర్ద్వాన్ జిల్లాలోని ఒక చెరువులో వందలాది ఆధార్ కార్డులు దొరికాయి.
Bandi Sanjay: జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మీటింగ్‌కు పోలీసులు అనుమతి రద్దు చేశారు. షెడ్యూల్ ప్రకారం ఈరోజు సాయంత్రం బోరబండలో కొనసాగాల్సిన బండి సంజయ్ మీటింగ్‌ను నిలిపేశారు. పోలీసుల తీరుపై బీజేపీ శ్రేణుల మండిపడుతున్నారు. అనుమతి ఇచ్చి రద్దు చేయడమేంటని బీజేపీ ఎన్నికల ఇంఛార్జీ ధర్మారావు ప్రశ్నించారు.
Election Commission: హర్యానాలో ఓట్ల దొంగతనం జరిగినట్లు రాహుల్ గాంధీ బుధవారం భారత ఎన్నికల కమిషన్(ECI) తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే, ఈ ఆరోపణల్ని ఈసీ ఖండించింది. కాంగ్రెస్ నేత ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ డ్రైవ్(SIR) కు మద్దతు ఇస్తున్నారా.? లేక వ్యతిరేకిస్తున్నారా.? అని ప్రశ్నించింది. సర్ ద్వారా ఈసీ నకిలీ, చనిపోయిన, వేరే ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లను తొలగిస్తుంది. 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగినట్లు రాహుల్ గాంధీ ఆరోపించారు.…
Rahul Gandhi: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ న్యూఢిల్లీలోని ఇందిరా భవన్‌లో ఓట్ చోరీ అంశంపై విలేకరుల సమావేశం నిర్వహించారు. “హెచ్ ఫైల్స్” అనే శీర్షికతో జరిగిన ఈ విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ ఎన్నికల రిగ్గింగ్ గురించి తీవ్రమైన ఆరోపణలు చేశారు. బీహార్‌లోని 121 అసెంబ్లీ స్థానాలకు మొదటి దశ పోలింగ్ జరగడానికి కొన్ని రోజుల ముందు ఈ విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలను లేవనెత్తుతూ…
SIR: దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)’’ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. బీహార్‌లో ఇప్పటికే ఇది వివాదాస్పదం అయింది. నకిలీ ఓటర్లను తీసేస్తున్నామని ఎన్నికల సంఘం చెబుతున్నప్పటికీ, ఇది ఉద్దేశపూర్వకంగా బీజేపీకి సహకరించేందుకు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఇదిలా ఉంటే, తమిళనాడులో ఎన్నికల కమిషన్ చేపట్టే ఓటర్ల జాబితా సవరణను సవాల్ చేస్తూ డీఎంకే సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేడి రోజురోజుకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు.
Rahul Gandhi: బీహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై బీజేపీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ప్రధానమంత్రి కార్యాలయాన్ని అగౌరపరిచేవిగా, ‘‘మర్యాద అన్ని హద్దులు దాటాయి’’ అని బీజేపీ పేర్కొంది. ఇలాంటి వ్యాఖ్యలు వ్యక్తిగమైనవని, ఎగతాళి చేసేవిగా ఉన్నాయని, భారత గణతంత్ర రాజ్య అత్యున్నత రాజ్యాంగ కార్యాలయ గౌరవాన్ని అవమానించే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాయని చెప్పింది.