AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది.. ఈ టైంలో కీలక నిర్ణయం తీసుకుంది ఎన్నికల కమిషన్.. అంగన్వాడీలు, కాంట్రాక్టు ఉద్యోగులను ఎన్నికల విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించారు.. పోలింగ్ విధుల్లో సిబ్బంది కొరత దృష్ట్యా అంగన్వాడీలు, కాంట్రాక్టు ఉద్యోగులను ఓపీఓలుగా నియమించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల కమిషన్.. మరోవైపు ఎన్నికల విధుల్లో పాల్గొనే అన్ని కేటగిరీల వారికి పోస్టల్ బ్యాలెట్ కోసం ఫాం 12 డి జారీ గడువును మే 1 తేదీ వరకూ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.. ఈ మేరకు శుక్రవారం రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా.. ఉత్తర్వులు జారీ చేశారు.. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీనా.. కాగా, ఇప్పటికే ఏపీలో కీలకమైన నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాగా.. నామినేషన్ల పరిశీలన కూడా పూర్తి చేశారు.. మే 13వ తేదీన ఎన్నిలకు సంబంధించిన పోలింగ్ జరగనున్న విషయం విదితమే.
Read Also: TSRTC: భక్తులకు టీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి శ్రీశైలంకు గంటకో బస్సు..