Pensions Distribution: ఇంటింటికి వెళ్లి పెన్షన్ల పంపిణీ విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.. పెన్షన్ పంపిణీలో వృద్ధులకు ఇబ్బంది రాకుండా చూడాలని సీఎస్ జవహర్ రెడ్డికి జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది ఎన్నికల కమిషన్.. ఇంటింటికి పెన్షన్ల పంపిణీ చేపట్టే అంశంలో ప్రభుత్వంపై చాలా ఫిర్యాదులు వచ్చాయన్న ఈసీ.. ఇంటింటికి పెన్షన్ల పంపిణీ విషయంలో గతంలో ఏం ఆదేశాలు ఇచ్చామో వాటిని పాటించాలని స్పష్టం చేసింది.. ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పెన్షన్ల పంపిణీ చేపట్టాలని గతంలో ఆదేశించింది ఎన్నికల కమిషన్.. ఇంటింటికి పెన్షన్ల పంపిణీ కుదరని పక్షంలో డీబీటీల రూపంలో చెల్లింపులు జరపాలని స్పష్టం చేసింది ఏపీ ఎన్నికల కమిషన్.
Read Also: B Vinod Kumar: కరీంనగర్ ఎంపీ ఎన్నికల్లో బండి సంజయ్, వినోద్ కుమార్ మధ్యనే పోటీ..
ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచడం మరియు వాలంటీర్లపై ఆంక్షలు విధించిన విషయం విదితమే. ఇప్పటికే ఎంపిక చేసిన లబ్ధిదారులకు కొనసాగుతున్న పథకాల ప్రయోజనాల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని.. ఇతర సాధారణ ఉద్యోగుల ద్వారా DBT (ఎలక్ట్రానిక్ బదిలీ) ఉపయోగించడం ఉత్తమం అని సూచిచింది.. ఏదైనా పథకం కింద (పింఛనుతో సహా) నగదు ప్రయోజనాన్ని సజావుగా పంపిణీ చేయడానికి చర్యలు తీసుకోవాలి.. ఇప్పటికే ఉన్న అర్హులైన లబ్ధిదారులు. జారీ చేసిన ఆదేశాలను అనుసరించాలని స్పష్టం చేసింది ఈసీ.