Election Commission: తెలంగాణలో పోలింగ్ సమయాన్ని పొడిగిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది. రాష్ట్రంలో మే 13న లోక్ సభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. సాధారణంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 5 గంటలలోపు క్యూ లైన్‌లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తారు.
Read also: మహాయుతిలో సీట్ల పంపకానికి గ్రీన్ సిగ్నల్.. బీజేపీకి 28, శివసేన-ఎన్‌సీపీకి..?
అయితే తెలంగాణలో ఎండల తీవ్రత ఓటింగ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని పలు రాజకీయ పార్టీలు రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాయి. ఈ విషయాన్ని ఈసీకి నివేదించింది. అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం తెలంగాణలో పోలింగ్ సమయాన్ని మరో గంట పొడిగించాలని ఈసీ నిర్ణయించింది. మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
Read also: Delhi High Court : అనుమతి లేకుండా ఫీజులు పెంచొద్దు.. ప్రభుత్వ సర్క్యులర్‌ను నిషేధించిన హైకోర్టు
దీని ప్రకారం సాయంత్రం 6 గంటల లోపు క్యూలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. 13న పోలింగ్ జరగనున్నందున.. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా పోలింగ్ సమయాన్ని 6 గంటల వరకు పొడిగించాలని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఈసీకి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం సానుకూల నిర్ణయం తీసుకుంది. అయితే నక్సల్స్ ప్రభావిత 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే పోలింగ్‌కు అనుమతించారు.
Read also: Chennai Super Kings: అదే మా ఓటమిని శాసించింది: రుతురాజ్ గైక్వాడ్
రాష్ట్రంలో ఇప్పటికే 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కు అనుమతిస్తే ఓటింగ్ పై తీవ్ర ప్రభావం పడుతుందని రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం ఆశించిన స్థాయిలో లేదు. ఈ నేపథ్యంలో పోలింగ్ సమయాన్ని పెంచాలని ఎన్నికల కమిషన్‌కు పలు వినతులు అందాయి. అన్ని రాష్ట్రాలు గంటపాటు సమయాన్ని పొడిగించడంతో ఇక్కడ కూడా గంట పొడిగించేందుకు ఈసీ అనుమతించింది.
సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉన్న నియోజకవర్గాలు
అసెంబ్లీ నియోజకవర్గం : లోక్‌సభ నియోజకవర్గ పరిధి
1. సిర్పూర్ : ఆదిలాబాద్
2. ఆసిఫాబాద్ : ఆదిలాబాద్
3. చెన్నూరు : పెద్దపల్లి
4. బెల్లంపల్లి : పెద్దపల్లి
5. మంచిర్యాల : పెద్దపల్లి
6. మంథని : పెద్దపల్లి
7. భూపాలపల్లి : వరంగల్
8. ములుగు : మహబూబాబాద్
9. భద్రాచలం : మహబూబాబాద్
10. పినపాక : మహబూబాబాద్
11. ఇల్లందు : మహబూబాబాద్
12. కొత్తగూడెం : ఖమ్మం
13. అశ్వారావుపేట : ఖమ్మం
Nagari Politics: నగరిలో రోజా వ్యతిరేక వర్గానికి షాక్.. కీలకనేతపై సస్పెన్షన్ వేటు..