West Bengal: పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితాపై స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) కొనసాగుతున్న సమయంలో, బుర్ద్వాన్ జిల్లాలోని ఒక చెరువులో వందలాది ఆధార్ కార్డులు దొరికాయి. ఈ ఘటన రాజకీయంగా సంచలనంగా మారింది. బుధవారం, లలిత్‌పూర్ లోని చెరువును శుభ్రం చేస్తున్న తరుణంలో స్థానికులకు భారీ సంచి కనిపించింది. దానిని తెరిచి చూడగా వందలాది ఆధార్ కార్డులు ఉన్నట్లు గుర్తించారు. ఈ కార్డుల్లోని అడ్రస్‌లు హమీద్‌పూర్, పిలా ప్రాంతాలలో నివసించే వ్యక్తులతో సరిపోలుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Also: Jaish-e-Mohammad: జైషే “మహిళా జిహాదీ” యూనిట్ ప్రారంభం.. బాధ్యతలు చేపట్టిన మసూద్ అజార్ సోదరి..
ఇంత పెద్ద సంఖ్యలో ఆధార్ కార్డులు కనిపించడం ఆధార్ కార్డులను కనుగొనడం వలన ఓటర్ జాబితా సవరణ సమగ్రతను దెబ్బతీసే అవకాశం ఉందని నివాసితులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, కార్డులు వందలాదిగా దొరడకం ప్రమాదవశాత్తు విస్మరించే సంఘటన కాదని, ఉద్దేశపూర్వకంగా జరిగి ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. పోలీసులు అన్ని ఆధార్ కార్డుల్ని స్వాధీనం చేసుకుని, వారి సోర్సెస్‌పై విచారణ ప్రారంభించారు. ఈ ఆధార్ కార్డులు చెరువులోకి ఎలా వచ్చాయి, ఎవరు, ఎందుకు తీసుకువచ్చారనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. ఈ సంఘటన అధికార టీఎంసీ, బీజేపీ మధ్య రాజకీయ ప్రతిష్టంభనకు ఆజ్యం పోసింది. బీజేపీ పశ్చిమ బెంగాల్ యూనిట్ ఆధార్ కార్డుల్లో అక్రమాలు కనిపిస్తున్నాయని ఆరోపించింది.
ఓటర్ల జాబితాలో నకిలీ ఓట్లను గుర్తించి తీసేయడానికి నవంబర్ 4 నుంచి డిసెంబర్ 4 వరకు కేంద్ర ఎన్నికల సంఘం 12 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ‘‘సర్’’ ప్రక్రియను నిర్వహిస్తోంది. బెంగాల్‌లో జనాభా పెరుగుదలతో పోలిస్తే, ఓటర్ల సంఖ్య, ఆధార్ కార్డుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ చొరబాటుదారులు నకిలీ ఆధార్ కార్డులు సంపాదించి, ఓటర్లుగా చెలామణి అవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.