Election Commission: ఓటర్ల జాబితా సవరణకు 7 రోజులు పొడిగింపు..
- ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం..
- ఓటర్ల జాబితా సవరణకు 7 రోజులు పొడిగింపు..
- డిసెంబర్ 11వ తేదీ వరకు సవరణ జరగనున్నట్లు ప్రకటించిన ఈసీ..
- డిసెంబర్ 16న ముసాయిదా జాబితా విడుదల..
- 12 రాష్ట్రాల్లో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Election Commission: భారత ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. రాబోయే ఎన్నికల దృష్ట్యా, ఓటర్ల జాబితాలో తమ పేర్లు సరిగ్గా ఉన్నాయో లేదో నిర్ధరించుకోవడానికి ప్రజలకు మరింత సమయం కల్పిస్తూ 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రత్యేక ఓటర్ సవరణకు అవకాశం కల్పిస్తూ వారం రోజులు గడువును పొడిగించింది. ఈ గడువు పొడిగింపు అండమాన్- నికోబార్ దీవులు, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లకు వర్తిస్తుంది.
Read Also: Jagtial: సర్పంచ్ పోరుకు కన్నతల్లితోనే పోటీ.. నామినేషన్ దాఖలు చేసిన తల్లీకూతుళ్లు
Also Read
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
- Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
సవరించిన ముఖ్య తేదీలు
* ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఎన్నికల సంఘం కొత్త తేదీలను ప్రకటించింది.
* ఎన్యూమరేషన్ (ఓటర్ల లెక్కించే) కాలం: డిసెంబర్ 11, (గురువారం) వరకు పొడిగించింది.
* పోలింగ్ స్టేషన్లు హేతుబద్ధీకరణ/ పునర్వ్యవస్థీకరణ: డిసెంబర్ 11, (గురువారం) నాటికి పూర్తి చేయాలి..
* కంట్రోల్ టేబుల్ నవీకరణ, ముసాయిదా జాబితా తయారీ: డిసెంబర్ 12-15, 2025 (శుక్రవారం నుంచి సోమవారం).
* ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ: డిసెంబర్ 16, 2025 (మంగళవారం).
* క్లెయిమ్‌లు, అభ్యంతరాల దాఖలు గడువు: డిసెంబర్ 16, 2025 నుంచి జనవరి 15, 2026 (గురువారం) వరకు.
* నోటీసు దశ: డిసెంబర్ 16, 2025 నుంచి ఫిబ్రవరి 7, 2026 (శనివారం) వరకు.. ఈ సమయంలో ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్లు ఓటర్ జబితాలోని అభ్యంతరాలు, ఎన్యూమరేషన్ ఫారమ్‌లను ఏకకాలంలో పరిష్కరిస్తారు.
Read Also: Google Pixel 10 Price Drop: గూగుల్ పిక్సెల్ 10పై 14 వేల తగ్గింపు.. ఎగబడిన జనం, స్టాక్ ఓవర్!
పౌరులకు ముఖ్య సూచన
ఓటర్ల జాబితా ఖచ్చితమైనది. అలాగే, సమ్మిళితంగా ఉండేలా చూడాలనే ఎన్నికల సంఘం నిరంతర ప్రయత్నంలో భాగంగా SIRను తీసుకొచ్చింది. ఈ గడువు పొడిగింపు ముఖ్యంగా రాబోయే ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోని ఓటర్లు తమ వివరాలను సరిచూసుకోవడానికి, అభ్యంతరాలు దాఖలు చేయడానికి లేదా అవసరమైన దిద్దుబాట్లు చేసుకోవడానికి అదనపు సమయాన్ని కేటాయించింది. ఈసీ ప్రకటించిన 12 రాష్ట్రాలు- కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రజలు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. తద్వారా భవిష్యత్తు ఎన్నికలలో ఓటు వేసే అవకాశాన్ని కోల్పోకుండా ఉంటారని ఎన్నికల అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Biscuit Recipe: ఓవెన్ అవసరం లేదు.. కడాయితోనే బేకరీ స్టైల్ బిస్కెట్లు ఇంట్లోనే.. తయారీ విధానం చాలా ఈజీ!
-
Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
-
2027 World Cup: ప్రపంచ కప్‌లో ఆడే టాప్ 6 ఆటగాళ్లు వీరే.. ఆకాశ్ చోప్రా అంచనా ఇలా..
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?