Bihar Election Results: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించబోతోంది. ఎవరూ ఊహించని విధంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మించి విజయం దిశగా వెళ్తోంది. బీజేపీ, జేడీయూ, ఎల్జేపీల జోడీ బంపర్ హిట్ అయింది. మరోవైపు, కాంగ్రెస్, ఆర్జేడీల కూటమి చతికిత పడింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో ఎన్డీయే కూటమి 190 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, మహాఘట్బంధన్ కూటమి 50 సీట్ల లోపు పరిమితమైంది.
Read Also: BJP: బీహార్ గెలిచాం, నెక్ట్స్ టార్గెట్ ఇక బెంగాల్..
ఇదిలా ఉంటే, ఈ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫలితాలను చూసిన కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ ఎక్స్‌లో సంచలన పోస్ట్ చేశారు. ‘‘SIR’’ విజయం దిశగా వెళ్తోందని ట్వీట్ చేశారు. బీహార్ ఎన్నికల ముందు ఎన్నికల సంఘం ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) నిర్వహించి, ఫేక్ ఓట్లను తొలగించింది. ఈ చర్యలను ప్రతిపక్షాలు విమర్శించాయి. బీజేపీతో ఈసీ కుమ్మక్కై ఓట్లను తొలగిస్తోందని ఆరోపించింది.
సర్‌పై విమర్శలు గుప్పిస్తూ.. ఇది ‘‘ప్రజాస్వామ్య హత్య’’ అని పేర్కొన్నారు. ఇది బీజేపీ-జేడీయూ విజయం కన్నా ఎన్నికల కమిషన్ విజయమని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీల ఓటర్ల పేర్లను తొలగించి, డిజిటల్ స్లిప్‌లు ఉన్నప్పటికీ వేలాది మంది ఓటర్లను వెనక్కి పంపారు, బీజేపీ నేతల్ని అనేక చోట్ల ప్రజలు తరిమికొట్టారని, కానీ వారు ఎలా గెలుస్తున్నారని ఉదిత్ రాజ్ ప్రశ్నించారు.