EVMs Trouble: ఏపీలో పలుచోట్ల మొరాయిస్తున్న ఈవీఎంలు.. నిలిచిపోయిన పోలింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Elections 2024: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ ప్రారంభమైన కొద్దీసేపటికే ఈవీఎంలు పెద్ద ఎత్తున మొరాయిస్తున్నాయి. దీంత ఎన్నికల సంఘం అధికారులు అప్రమత్తమైయ్యారు. వాటిలోని సమస్యను పరిష్కరించేందుకు టెక్నిషన్స్ ను రంగంలోకి దించింది. కాగా, ప్రకాశం జిల్లాలోని కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని 138, 140వ పోలింగ్ బూత్ లలో ఈవీఎంలు పనిచేయకపోవడంతో పోలింగ్ నిలిచిపోయింది. దీంతో పాటు చీమకుర్తి 23వ పోలింగ్ కేంద్రంలో పనిచేయని లోక్ సభ ఈవీఎం నిలిచిపోయిన పోలింగ్ ప్రక్రియ.. ఓటు వేసేందుకు భారీగా ఓటర్లు రావడంతో ఈవీఎంలు మొరాయించడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, నెల్లూరు జిల్లాలోని కందుకూరు మండలం కంచరగుంటలో 160 పోలింగ్ బూత్ లోను ఈవీఎం మోరాయించింది. దీంతో పాటు వరదయ్యపాలెం మండల కేంద్రంలో బూత్ నెంబర్ 64, బూత్ నెంబర్ 65, జడ్పీ హైస్కూల్లోని 89వ పోలింగ్ కేంద్రంలో కూడా ఈవీఎంలో సాంకేతిక లోపంతో ఇప్పటి వరకు పోలిగ్ ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఈవీఎంలను ఎన్నికల అధికారులు సరి చేస్తున్నారు.
Read Also: Jr NTR: ఓటు వేసేందుకు కుటుంబంతో వచ్చిన ఎన్టీఆర్!
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
అలాగే, శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి పట్టణంలోని 102 పోలింగ్ కేంద్రంలో లోక్ సభ స్థానానికి సంబంధించిన ఈవీఎం పని చేయడం లేదు. ఇక, గన్నవరం, పెనమలూరు, జగ్గయ్యపేటలో ఈవీఎంలలో సమస్యలు తలెత్తాయి. ఈవీఎంలలో ఇబ్బందితో గన్నవరం, పెనమలూరులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్దులు యార్లగడ్డ వెంకట్రావ్, బోడే ప్రసాద్ లు ఓటు వేయటానికి వచ్చి నిరీక్షిస్తున్నారు. అలాగే, జగ్గయ్యపేటలోనూ ఈవీఎంలలో సాంకేతిక లోపంతో ఇప్పటి వరకు పోలింగ్ ప్రారంభంకాలేదు. దీంతో పాటు నగరి నియోజక వర్గంలోని సీతారామపుర బూత్ లో ఈవీఎం మొరాయించింది. రంగంలోకి దిగిన ఎన్నికల కమిషన్ అధికారులు సరి చేస్తున్నారు.
Read Also: Elections 2024 : బెంగాల్‌లో ఓటింగ్ ముందు చెలరేగిన హింస… టీఎంసీ కార్యకర్త హత్య
అయితే, అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని 112 బూత్ లో ఈవీఎం మొరాంచడంతో అధికారులు మరమ్మతులు చేపట్టారు. తాడిపత్రి పట్టణంలోని 251 పోలింగ్ కేంద్రంలో ఎంపీకి సంబంధించిన ఈవీఎం సైతం పని చేయడం లేదు. యల్లనూరు మండలం వెన్నపూస పల్లి గ్రామంలోనూ ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. అలాగే, నంద్యాల జిల్లాలోని అవుకు మండలం రామవరంలో మొరాయించిన ఈవీయం, 7 గంటలు దాటినా కూడా పూర్తి కానీ, మాక్ పోలింగ్, మరో అరగంట పాటు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభం కానుంది.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!