AP ElectiErrabelli Dayakar Rao: కాంగ్రెస్ మంత్రి పదవి ఆఫర్ చేసినా వెళ్లలే.. దయన్న హాట్ కామెంట్ons 2024: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల సమయంలో.. ఎన్నికల కమిషన్ తీసుకునే ఏ నిర్ణయమైనా ఆసక్తికరంగా మారుతుంది.. ఇప్పుడు పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది.. పోలింగ్ ఏజెంట్ల నియామకం లిస్టును రిటర్నింగ్ అధికారికి ఇవ్వాల్సిన అవసరం లేదన్న ఎన్నికల సంఘం.. పోలింగ్ తేదీ రోజు ప్రిసైడింగ్ అధికారికి పోలింగ్ ఏజెంట్ తమ వివరాలు సమర్పిస్తే సరిపోతుందని పేర్కొంది.. పోలింగ్ ఏజెంట్లను అభ్యర్థి సర్టిపై చేయాల్సి ఉంటుందని పేర్కొంది ఈసీ.. ఇక, ప్రిసైడింగ్ ఆఫీసర్ సమక్షంలో పోలింగ్ ఏజెంట్ల నుంచి డిక్లరేషన్ తీసుకోవాలని స్పష్టం చేసింది ఎన్నికల కమిషన్. కాగా, ఎన్నికల సమయంలో.. డీజీపీ సహా కీలక పోలీసు అధికారుల బదిలీలు ఓవైపు.. గాజు గ్లాస్ కామన్ సింబల్ వ్యవహారం.. ఇలా అనేక వ్యవహారాల్లో ఎన్నికల కమిషన్ కీలకంగా వ్యవహరించిన విషయం విదితమే.. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో అన్ని పార్టీలో ప్రచారాన్ని ఉధృతం చేయగా.. రేపు సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది.. ఈ నెల 13వ తేదీన పోలింగ్ నిర్వహించనున్న విషయం తెలిసిందే.
Read Also: Errabelli Dayakar Rao: కాంగ్రెస్ మంత్రి పదవి ఆఫర్ చేసినా వెళ్లలే.. దయన్న హాట్ కామెంట్