ఏపీలో ఎన్నికల సమయంలో, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. కంటైనర్లు, బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ పోయవద్దని పెట్రోల్ బంక్ నిర్వాహకులను ఎన్నికల సంఘం ఆదేశించింది.
పల్నాడు కలెక్టరుగా లత్కర్ శ్రీకేష్ బాలాజీ నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు బాధ్యతలు చేపట్టాలని ఈసీ ఆదేశించింది. ఈ మేరకు ఏపీ సీఎస్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో ఈ-ఆఫీస్ అప్ గ్రేడేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. రేపట్నుంచి(ఈ నెల 18) ఈ నెల 25వ తేదీ వరకు ఈ-ఆఫీస్ అప్ గ్రేడేషన్ ప్రక్రియ చేపట్టనున్నట్టు ఎన్ఐసీ షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఏపీలో పోలింగ్ రోజు, అనంతరం 3 జిల్లాల్లో జరిగిన హింసపై ప్రాథమిక విచారణ పూర్తి చేసి ఈసీకి సీఈఓ కార్యాలయం నివేదిక పంపినట్లు తెలుస్తోంది. హింసాత్మక ఘటనలపై ఈసీ ఆదేశాల మేరకు సీఎస్ జవహర్ రెడ్డి సిట్ ఏర్పాటు చేశారు.
ఎన్నికల తర్వాత జరుగుతున్న హింసను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి నేడు ( గురువారం ) ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నివేదిక రెడీ చేసినట్లు సమాచారం.
మే 13న జరిగిన ఎన్నికల భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ పోలింగ్ నమోదు అయ్యింది. ఎప్పుడు లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ తో కలిపి 81.76% పోలింగ్ నమోదయింది. ఇందులో ఈవీఎంల ద్వారా 80.6% పోలింగ్ నమోదయింది. పోస్టల్ బ్యాలెట్ నుండి 1.1% ఓట్లు నమోదు అయ్యాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా చూస్తే ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 87.09% ఓట్లు నమోదు అవ్వగా.. అత్యల్పంగా విశాఖ జిల్లాలో 68.63% ఓట్లు నమోదు అయ్యాయి. ఇక జిల్లాల…
ఎన్నికల కమిషన్ విచారించి నిర్ణయం తీసుకోవాలి.. చంద్రబాబు మోసగాడు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా చెత్తబుట్టలో వేశాడు.. జగన్ మొనగాడు ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకున్నాడు.. మోసగాడు కావాలో మొనగాడు కావాలో ప్రజలే నిర్ణయిస్తారంటూ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం జరిగిన ఎన్నికల్లో మా అంచనా ప్రకారం 81 శాతం మేర పోలింగ్ నమోదు కావచ్చు అని ఏపీ సీఈఓ ముకేశ్ కుమార్ మీనా అన్నారు. 1.2 శాతం పోస్టల్ బ్యాలెటుతో కలుపుకుని ఇప్పటి వరకు సుమారుగా 79. 40 శాతం నమోదైనట్టు చెప్పొచ్చు.
కడప జిల్లాలో రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగింది. దాదాపు 86 శాతం మేర ఓట్లు పోలైనట్లు ఈసీ ప్రకటించింది. మొత్తం జిల్లాలో ఓట్లు 2,42, 556 ఉన్నాయి. ఇందులో పురుషులు 1, 02, 789 ఓట్లు మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా.. మహిళలు 1, 07, 449 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.