Clashes erupt in Palnadu: పల్నాడు జిల్లాలో ఉద్రిక్తత కొనసాగుతుంది. అచ్చంపేట మండలం వేల్పూర్ లో మరోసారి వివాదం చెలరేగుతుంది. నిన్న ( సోమవారం ) పోలింగ్ బూత్ దగ్గర గ్రామంలోని రెండు వర్గాల వారికి గొడవ జరిగింది. ఎన్నికల నేపథ్యంలో ఇరు వర్గాలను పోలీసులు శాంతింపజేశారు. అయితే, నేడు మరోసారి ఇరు వర్గాల వారు కవ్వింపు చర్యలకు దిగారు. ఓ వర్గం వారు ఉంటున్న ఏరియాకు బైక్ ర్యాలీతో వెళ్ళిన మరో వర్గం.. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగే పరిస్థితి ఉందని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. అయితే, టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఘర్షణలు జరగడంతో ఈసీ తీవ్ర స్థాయిలో మండిపడింది.
Read Also: Guntur Collector: రాబోయే 20 రోజులు ఈవీఎంలను కంటికి రెప్పలా కాపాడుతాం
కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా ఆంపలుచోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. దీనిపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాలోని తెనాలి, పల్నాడు జిల్లాలోని మాచర్ల, అనంతపురంలో జరిగిన సంఘటలకు బాధ్యులైన వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలంటూ ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీస్ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు.