Supreme Court : ఓటరు నమోదు ఆలస్యంపై ఎన్నికల సంఘం దాఖలు చేసిన ఏడీఆర్ పిటిషన్‌పై విచారణ ప్రారంభమైంది. జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది.
రాష్ట్ర ప్రధాన పార్టీలూ అన్ని కలిపి 10 వేల కోట్లు ఖర్చు పెట్టారు.. ఎలక్షన్ కమిషన్ కూడా అమ్మడు పోయింది.. పిన్నెలి తప్పు చేసాడు కాబట్టే గన్ మెన్ లను సైతం విడిచి పెట్టి రాష్ట్రం వదలి పరారి అయాడు అని పోలీసులే గంజాయి అమ్మిస్తున్నారు అని సీపీఐ రామకృష్ణ ఆరోపించారు.
ఏపీలో ఎన్నికల సమయంలో ఘర్షణలపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. తిరుపతి, పల్నాడు, తాడిపత్రిలోనే సిట్ అధికారులు మకాం వేసింది. అవసరమైతే మరోసారి అల్లర్లు జరిగిన ప్రాంతానికి సిట్ టీమ్ వెళ్లనుంది. జిల్లాల్లో పోలీసులు కేసులు విచారిస్తున్న తీరుపై సిట్ మరో నివేదిక ఇచ్చే అవకాశం కూడా ఉంది.
Election Commission: కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఈ రోజు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కీలక సూచనలు చేసింది. రక్షణ దళాల కార్యకలాపాలకు సంబంధించి రాజకీయ ప్రచారానికి పాల్పడొద్దని, రాజ్యాంగం రద్దు చేస్తారంటూ తప్పుదు అభిప్రాయాలను కలిగించే
మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పీఎస్ నంబర్ 202తో పాటు 7 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేశారని ఏపీ సీఈవో కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. పోలింగ్ కేంద్రం నంబర్ 202లో జరిగిన ఘటనలో సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెబ్ కెమెరాలో రికార్డయ్యారని తెలిపింది.
తిరుపతి అసెంబ్లీ పరిధిలో ఏఎస్డీ లిస్ట్ లో ఉన్న 54 వేల మంది ఓటర్ లిస్ట్ లో 4 వేల మంది మాత్రమే ఓటు వేశారు అని జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందని ఎన్నికల కమిషన్ కి ఇంటలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. కాకినాడ సిటీ, పిఠాపురం నియోజకవర్గాల్లో అల్లర్లు జరిగే అవకాశం ఉందంటూ అలర్ట్ చేసింది. కౌంటింగ్ కు ముందు, తర్వాత దాడులు జరిగే ఛాన్స్ ఉందని ఎన్నికల కమిషన్ కు నిఘా వర్గాలు నివేదికను ఇచ్చాయి.