AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా పోలింగ్ శాతం నమోదు అయిందని ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఈసీ లెక్కల ప్రకారం 78.36 శాతం మేర పోలింగ్ అయినట్లు పేర్కొన్నారు. ఇవాళ మధ్యాహ్నం లేదా సాయంత్రానికి పూర్తి స్థాయి పోలింగ్ శాతం వస్తుందన్న ఎన్నికల కమిషన్ వర్గాలు వెల్లడించాయి. గత ఎన్నికల పోలింగ్ శాతం కంటే ఈసారి పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని ఏపీ సీఈఓ ఎంకే మీనా పేర్కొన్నారు.
Read Also: Gaza: గాజాలో ఐరాస వాహనంపై దాడి.. భారతీయుడు మృతి
కాగా, 82 లేదా 83 శాతం వరకు పోలింగ్ శాతం ఫైనల్ ఫిగర్స్ ఉండొచ్చని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా అంచనా వేస్తున్నారు. చాలా చోట్ల అర్ధరాత్రి వరకూ పోలింగ్ జరిగినట్లు పేర్కొన్నారు. మచిలీపట్నం, గన్నవరం నియోజకవర్గాలు, శ్రీ సత్య సాయి జిల్లాల్లో రాత్రి 12 గంటల తర్వాత కూడా పోలింగ్ కొనసాగింది. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున ఓటర్లు క్యూ లైన్లో వేచి ఉన్నారు. ఇవాళ 17A స్క్రూట్నీ తర్వాత రాష్ట్రంలో రీ- పోలింగ్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాగా, ఏపీలో జరిగిన ఘర్షణల్లో 11 చోట్ల ఈవీఎంలు ధ్వంసం అయినట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది.