పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా సీఈవో జారీ చేసిన మోమోలను రద్దు చేయాలని కోరుతూ వైసీపీ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది.
సజ్జల మాట్లాడుతూ.. చంద్రబాబు అడ్డదారిలో పట్టు నిలుపుకోవాలి అనుకుంటున్నారు. ఈసీ, ఎన్డీయే కూటమి ఏ విధంగా అన్యాయంగా వ్యవహరిస్తుందో అందరికీ తెలుసు అన్నారు. ప్రజా తీర్పు వైసీపీకి అనుకుంలాగా ఉంది.. పోస్టల్ బ్యాలెట్ విషయంలో గందరగోళానికి గురి చేస్తున్నారు జాగ్రత్తగా చూడాలి అని సూచించారు.
తిరుపతి జిల్లా చంద్రగిరి డీఎస్పీ శరత్ రాజ్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఆయన్ని డీజీపీ ఆఫీసుకి సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రగిరిలో ఎన్నికల పోలింగ్, ఆ తర్వాత జరిగిన ఘటనలపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌంటింగ్కు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. కౌంటింగ్ ఏజెంట్లకు అధికారులు శిక్షణ ఇస్తున్నారు. కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏజెంట్లకు వైసీపీ, టీడీపీ పార్టీల అధినేతలు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో హింసాత్మక ఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు వచ్చీ రాగానే టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పలు కీలక అంశాలపై సూచనలు చేశారు. ఎల్లుండి పార్టీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతో చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు.
పల్నాడు డీపీవో విజయభాస్కర్ రెడ్డిపై విచారణకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మాచర్ల నియోజకవర్గానికి వెబ్ కాస్టింగ్, పర్యవేక్షణ అధికారిగా ఉన్న డీపీఓ విజయభాస్కర్ రెడ్డి..
Naveen Patnaik : జూన్ 1న ఒడిశాలో జరగనున్న చివరి దశ ఎన్నికలకు ముందు సీఎం నవీన్ పట్నాయక్ ప్రత్యేక కార్యదర్శి డిఎస్ కుటేపై ఎన్నికల సంఘం (ఇసిఐ) పెద్ద చర్య తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌంటింగ్ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే సమస్యాత్మకంగా మారిన పల్నాడు, తిరుపతి, తాడిపత్రిలో ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్ మీనా చెప్పారు.
గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి ముఖేష్ కుమార్ మీనా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుంటూరు పార్లమెంటుకు సంబంధించి, ఏడు అసెంబ్లీ స్థానాల కౌంటింగ్ కు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు.