AP Postal Ballot votes: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌంటింగ్ కు సమయం దగ్గర పడుతుండటంతో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై టీడీపీ- వైసీపీ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. పోలింగ్ ముగిసిన తర్వాత కొద్ది రోజులుగా మౌనంగా ఉన్న నేతలు ఇప్పుడు మళ్లీ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై ఈసీ పెట్టిన నిబంధనలపై కొత్త వివాదం కొనసాగుతుంది. ఇక, పోస్టల్ బ్యాలెట్టుపై ఆర్వో సీల్ లేదా సంతకం లేకున్నా లెక్కించవచ్చు అని తెలిపింది. ఈ నిబంధనల సడలింపుపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికే ఏపీ అదనపు సీఈవోను కలిసి కంప్లైంట్ చేశారు. పోస్టల్ బ్యాలెట్ కవర్ల దగ్గర నుంచి, 13ఏ, 13బీ నిబంధనలు అన్నీ ముందే చెప్పారు.. ఇప్పుడు మళ్లీ సడలింపులు ఏమిటని మాజీ మంత్రి పేర్ని్నాని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
Read Also: Ramajogayya Sastry : దేనికైనా కాస్త ఓపిక, సహనం ఉండాలి.. వైరల్ అవుతున్న రామజోగయ్య శాస్త్రి ట్వీట్..
కాగా, నిబంధనలకు విరుద్దంగా సడలింపు జరిగిందని వైసీపీ ఆరోపిస్తుంది. ఇక, ఓటమి భయంతోనే పోస్టల్ బ్యాలెట్ విషయంలో వైసీపీ రాద్దాంతం చేస్తోందని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆర్వోలు చేసే తప్పిదానికి తమ ఓటు మురిగిపోవడం కరెక్ట్ కాదని ఉద్యోగ సంఘాలు తెలియజేస్తున్నాయి. మరోవైపు ఏపీ ఎన్నికల్లో ఈసారి రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి. మొత్తం 5 లక్షల 39 వేల 189 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్ కాగా.. శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 38 వేల 865 ఓట్లు వేసినట్లు ఈసీ ప్రకటించింది. భారీగా పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కారణంగా ఎన్నికల ఫలితాలు సైతం కాస్త ఆలస్యంగా వెల్లడయ్యే ఛాన్స్ ఉంటుంది.