Chandragiri DSP: చంద్రగిరి డీఎస్పీపై వేటు.. డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandragiri Dsp Sarath Rajkumar: తిరుపతి జిల్లా చంద్రగిరి డీఎస్పీ శరత్ రాజ్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఆయన్ని డీజీపీ ఆఫీసుకి సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రగిరిలో ఎన్నికల పోలింగ్, ఆ తర్వాత జరిగిన ఘటనలపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన పరిణామాల విషయంలో డీఎస్పీ నిర్లక్ష్యం వహించినందుకే తగిన చర్యలు తీసుకున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు.
Read Also: Uttarpradesh : హిందూ ఫ్రెండ్ ను కలిసినందుకు ముస్లిం విద్యార్థిని సస్పెండ్ చేసిన స్కూల్
Also Read
అలాగే, నియోజకవర్గంలో శాంతిభద్రతలు నెలకొల్పడంలో విఫలం కావడంతో పాటు పోలింగ్ రోజు రాత్రి జరిగిన ఘర్షణలపై టీడీపీ నేతలు ఆరోపణలు చేయడంతో పాటుగా సిట్ నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇక, డీఎస్పీ రాజ్‌కుమార్ మూడు నెలల క్రితం చంద్రగిరి డీఎస్పీగా నియామకం అయ్యారు. అలాగే, డీఎస్పీ రాజ్‌కుమార్ తన స్నేహితుడైన హోమియోపతి డాక్టర్ ను స్ట్రాంగ్ రూమ్ లోకి తీసుకెళ్లారని తెలుస్తుంది.. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను చూసి ఎన్నికల కమిషన్ సీరియస్ కావడంతో వేటు వేసినట్లు ప్రచారం జరుగుతుంది.
Read Also: Krishana Chaitanya : గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మొదట వారితో తీద్దాం అనుకున్నా.. కానీ..?
కాగా, ఈ నెల 13వ తేదీన పోలింగ్ రోజున రాత్రి.. చంద్రగిరి మండలం కూచివారిపల్లె, రామిరెడ్డిపల్లెల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ దాడులకు చంద్రగిరి పోలీసుల నిర్లక్ష్యమే కారణమని సిట్ అధికారులు ఈసీకి ఇచ్చిన రిపోర్టులో వెల్లడించారు. అందుకే చంద్రగిరి డీఎస్పీపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. శరత్ రాజ్‌కుమార్‌ను వెంటనే డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఈసీ ఆదేశించింది. సిట్ నివేదికతో మరికొంత మంది అధికారులపై వేటు పడే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
BC Reservation: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు సంచలన తీర్పు.. జీవోలు కొట్టివేత
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
ATF Price Hike: విమాన ప్రయాణికులకు షాక్.. జెట్ ఫ్యూయల్ ధరలు పెంపు..
-
Chandu Mondeti : టాలీవుడ్, బాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ లాక్..?
-
UPSC Centenary 2026: UPSC శతాబ్ది వేడుకలు.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వందేళ్ల చరిత్ర ఇదే
ట్రెండింగ్
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!