పల్నాడు డీపీవో విజయభాస్కర్ రెడ్డిపై విచారణకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మాచర్ల నియోజకవర్గానికి వెబ్ కాస్టింగ్, పర్యవేక్షణ అధికారిగా ఉన్న డీపీఓ విజయభాస్కర్ రెడ్డి.. పాలువాయిలో వైస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఈవీఎంని ధ్వంసం చేసిన విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పకుండా గోప్యంగా ఉంచాడు.. దీంతో డీపీఓ విజయభాస్కర్ రెడ్డిపై ఎన్నికల సంఘంకి ఫిర్యాదు చేసిన టిడిపి నాయకులు.. దీంతో రంగంలోకి దిగిన ఈసీ విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ బాలాజీకి ఆదేశాలు జారీ చేసింది.
కాగా,ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిపై నమోదైన ఈవీఎం ధ్వంసం కేసులో ఏపీ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే, ఈ బెయిల్ కు కొన్ని షరతులను కూడా విధించింది. ఇందులో ప్రతి రోజూ ఎస్పీ కార్యాలయానికి హాజరై సంతకం చేయాలనే కండిషన్ పెట్టింది.. ఈ నేపథ్యంలో పిన్నెల్లి దాదాపు రెండు వారాల తర్వాత పల్నాడులోకి రీఎంట్రీ ఇచ్చారు. ఎస్పీ ఆఫీసుకు పిన్నెల్లి వస్తున్నారనే సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అయితే, ప్రత్యర్థుల నుంచి ముప్పు పొంచి ఉండటంతో ఆయన అర్ధరాత్రి 12 గంటలకు ఎస్పీ మలికా గార్గ్ ముందు సంతకం పెట్టి వెళ్లిపోయారు. అయితే, మరో 5 రోజుల్లో ఓట్ల లెక్కింపు ఉన్న నేపథ్యంలో పోలీసులు మాచర్లలో తగిన భద్రతా ఏర్పాట్లు చేశారు.