అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు వచ్చీ రాగానే టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పలు కీలక అంశాలపై సూచనలు చేశారు. ఎల్లుండి పార్టీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతో చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు. జూన్ 1న జోనల్ స్థాయిలో కౌంటింగ్ ఏజెంట్లకు టీడీపీ శిక్షణ ఉంటుంది. కౌంటింగ్ రోజు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఈసీ, డీజీపీకి లేఖ రాయాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు రేపు సాయంత్రం అమరావతి రానున్నారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. పోస్టల్ బ్యాలెట్లపై వైసీపీ చేస్తున్న రాద్ధాంతం పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఓటమికి వైసీపీ నేతలు కారణాలు వెతుకుతున్నారన్నారు. ఈసీ, పోలీసులు తీరుపై అందుకే విమర్శలు చేస్తున్నారన్నారు.
READ MORE: MS Dhoni: టీమిండియా హెడ్ కోచ్ పదవికి ధోని అనర్హుడు.. ఎందుకో తెలుసా..
కాగా.. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై టీడీపీ- వైసీపీ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. పోలింగ్ ముగిసిన తర్వాత కొద్ది రోజులుగా మౌనంగా ఉన్న నేతలు ఇప్పుడు మళ్లీ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై ఈసీ పెట్టిన నిబంధనలపై కొత్త వివాదం కొనసాగుతుంది. ఇక, పోస్టల్ బ్యాలెట్టుపై ఆర్వో సీల్ లేదా సంతకం లేకున్నా లెక్కించవచ్చు అని తెలిపింది. ఈ నిబంధనల సడలింపుపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికే ఏపీ అదనపు సీఈవోను కలిసి కంప్లైంట్ చేశారు. పోస్టల్ బ్యాలెట్ కవర్ల దగ్గర నుంచి, 13ఏ, 13బీ నిబంధనలు అన్నీ ముందే చెప్పారు.. ఇప్పుడు మళ్లీ సడలింపులు ఏమిటని మాజీ మంత్రి పేర్ని్నాని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.