Amit Shah: అమిత్‌షా హెలికాప్టర్‌ను తనిఖీ చేసిన ఎన్నికల సంఘం అధికారులు (వీడియో)
- మరి కొద్ది రోజుల్లో మహారాష్ట్ర ఎన్నికలు
- కొనసాగుతున్న ముఖ్యనేతల వాహన తనిఖీలు
- తాజాగా కేంద్ర హోం మంత్రి హెలికాప్టర్‌లో తనిఖీలు
- ఈ వీడియోను పంచుకున్న అమిత్‌షా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికల సంఘం అధికారులు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా హెలికాప్టర్‌ను, బ్యాగును తనిఖీ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను హోంమంత్రి అమిత్ షా హెలికాప్టర్ స్వయంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో పంచుకున్నారు. ఎన్నికల ర్యాలీలో ప్రసంగించేందుకు ఆయన ఈరోజు హింగోలి చేరుకున్నారు. అక్కడ ఉన్న ఎన్నికల సంఘం అధికారులు ఆయన హెలికాప్టర్‌ను తనిఖీ చేశారు. ఈ వీడియో క్యాప్షన్‌లో ఇలా రాశారు. “ఈ రోజు మహారాష్ట్రలోని హింగోలి అసెంబ్లీలో ఎన్నికల ప్రచారంలో నా హెలికాప్టర్‌ను ఎన్నికల సంఘం అధికారులు తనిఖీ చేశారు. నిష్పక్షపాత ఎన్నికలు, ఆరోగ్యకరమైన ఎన్నికల వ్యవస్థను బీజేపీ విశ్వసిస్తుంది. గౌరవనీయమైన ఎన్నికల సంఘం రూపొందించిన అన్ని నిబంధనలను అనుసరిస్తుంది. మనమందరం ఎన్నికల వ్యవస్థకు సహకరించాలి. భారతదేశాన్ని ప్రపంచంలోనే బలమైన ప్రజాస్వామ్యంగా ఉంచడంలో మన బాధ్యతలను నిర్వర్తించాలి.” అని రాసుకొచ్చారు.
READ MORE: Pune: మూడంతస్తుల బిల్డింగ్‌లో భారీ అగ్నిప్రమాదం.. చిన్నారుల సాహస దృశ్యాలు వైరల్
Also Read
కాగా.. హోం మంత్రి అమిత్ షా షేర్ చేసిన వీడియోలో ఎన్నికల అధికారులు ఆయన హెలికాప్టర్‌ను తనిఖీ చేస్తున్నట్లు చూడవచ్చు. ఇదిలా ఉండగా.. హారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రచారంలో పాల్గొనే నేతల బ్యాగులు, హెలికాప్టర్లలో తనిఖీల పరంపర కొనసాగుతోంది. కొద్ది రోజుల క్రితం లాతూర్, యవత్మాల్ జిల్లాల్లో ఎన్నికల సంఘం అధికారులు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బ్యాగ్ ని తనిఖీ చేశారు. ఈ దర్యాప్తునకు సంబంధించిన వీడియోను ఆయన పంచుకుంటూ.. ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అధికార కూటమిలోని ఇతర సీనియర్ నాయకులకు కూడా ఇదే నిబంధనలు వర్తింపజేయాలి అని డిమాండ్ చేశారు. ఈ ఘటన తర్వాత మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్‌ల బ్యాగులను కూడా పరిశీలించగా వాటికి సంబంధించిన వీడియోలు కూడా బయటపడ్డాయి.
आज महाराष्ट्र की हिंगोली विधानसभा में चुनाव प्रचार के दौरान चुनाव आयोग के अधिकारियों के द्वारा मेरे हेलिकॉप्टर की जाँच की गई।
भाजपा निष्पक्ष चुनाव और स्वस्थ चुनाव प्रणाली में विश्वास रखती है और माननीय चुनाव आयोग द्वारा बनाए गए सभी नियमों का पालन करती है।
एक स्वस्थ चुनाव… pic.twitter.com/70gjuH2ZfT
— Amit Shah (@AmitShah) November 15, 2024
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?