ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో పెండ్యాల గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మొండితోక జగన్ మోహన్ రావు ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్ జెండాలతో ఉప్పొంగింది. కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మొండితోకకు పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. వందలాది మంది తరలి వచ్చిన గ్రామస్థులు ఎమ్మెల్యేపై పూల వర్షం కురిపించి ముందుకు నడిపించారు.
Read Also: America : ఇన్సులిన్‌తో 17 మంది రోగులను చంపిన అమెరికన్ నర్సుకు 760ఏళ్ల జైలు
ఈ సందర్భంగా మొండితోక జగన్ మోహన్ రావు మాట్లాడుతూ.. పెండ్యాల గ్రామానికి మంచి జరిగితేనే జగనన్నను ఆశీర్వదించండి.. మా పాలనలో మార్పు కనపడితే మద్దతు ఇవ్వండి అని కోరారు. ఎన్నికల ప్రచారంలో తిరుగుతుంటే ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది.. రెండోసారి మరల మా ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రజలు కోరుతున్నారు అని ఆయన చెప్పుకొచ్చారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి బాగుందని ప్రజలందరూ అంటున్నారు. ఇక, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో చూస్తుంటే ప్రజలకు అర్థం కాని పరిస్థితి నెలకొంది అని ఎద్దేవా చేశారు. మా సంక్షేమ పథకాలను అమలు చేయడానికి సాధ్యం కాదని విమర్శించారు.. కానీ, మా ముఖ్యమంత్రి వాటిని చేసి చూపించారన్నారు. అయితే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్లు ఇవే పథకాలను కాపీ కొట్టి వారి మేనిఫెస్టోలో పెట్టుకున్నారని నందిగామ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మొండితోక జగన్ మోహన్ రావు తెలిపారు.