నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) కుంభకోణానికి ముగింపు పలకాలని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే నేత ఎంకే స్టాలిన్ శుక్రవారం అన్నారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ.. విద్యా సమగ్రతను కాపాడేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.
డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే తెలంగాణ పాలిసెట్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. పాలిసెట్ పరీక్షను మే 24న నిర్వహించిన సంగతి తెలిసిందే. తెలంగాణ వ్యాప్తంగా 82, 809 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.
ఏపీ ఐసెట్-2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 6న ఏపీలో 111, తెలంగాణలో 2 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తంగా 48,828 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 44,446 మంది పరీక్షలకు హాజరయ్యారు.
AP PGESET-2024 కు గాను మార్చి 23న ప్రారంభమైన ఈ కార్యక్రమం దరఖాస్తుకు ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 20తో ముగిసింది. అయితే, మే 8 నుండి ఏపీ PGESET అప్లికేషన్‌ల కోసం మార్పు విండో తెరవబడింది. అభ్యర్థులు తమ దరఖాస్తును సవరించుకోవడానికి మే 14 వరకు గడువు ఉంది. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఏపీ విశ్వవిద్యాలయాలలో ME, MTech, MPharmacy, PharmD అలాగే అనుబంధ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికి PGESET నిర్వహిస్తుంది.…
టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. బాలకృష్ణ చీపురుపల్లి, విజయనగరంలో పర్యటనలో మాట్లాడే తీరు చూశానని.. పేపర్లు ఇటుతిప్పి అటుతిప్పి మాట్లాడారని ఎద్దేవా చేశారు. అసలు భౌగోళిక పరిస్థితులపై అసలు అవగాహన ఉందా అని విమర్శించారు. బాలకృష్ణ విద్యాశాఖపై మాట్లాడారు.. డిబెట్ కి రండి అని మంత్రి బొత్స సవాల్ విసిరారు. కళ్లులేని కబోదికి ఏం తెలుస్తుంది ఆ విధంగా ఉంది ప్రసంగమని అన్నారు. మూడో తరగతి నుంచే టోఫెల్…
ఏపీ టెన్త్ 2023-24 ఫలితాలు విడుదలయ్యాయి.. ఈ సారి కూడా బాలికలే పైచేయి సాధించారు.. ఎస్ఎస్సీ ఫలితాలను విడుదల చేసిన ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతీ విద్యార్ధి వెబ్‌సైట్‌లో ఫలితాలు చూసుకోవచ్చు అన్నారు. ఇక, ఈ ఏడాది 6,16,615 మంది పరీక్షలు రాశారు.. 16 లక్షల్లో 86.69 శాతం విద్యార్థులు.. అంటే 5,34,578 మంది ఉత్తీర్ణులు అయినట్టు వెల్లడించారు.. ఇక, వీరిలో బాలురు 83.21 శాతం, బాలికలు 89.17…
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి.. విజయవాడలోని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో ఇంటర్ ఫస్టియర్తో పాటు సెకండియర్ ఫలితాలను విడుదల చేశారు అధికారులు.. ఈ సారి దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు.. అయితే, ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో 67 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.. ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో 78 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.