రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ సంబంధించిన ఖాళీలను అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో భర్తీ చేసేందుకు ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. 3445 పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ప్రారంభించింది. త్వరలో దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది. ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
World Students Day 2024: ప్రస్తుతం రాజకీయంగా ఒక్క చిన్న పదవి ఉంటే చాలు కొన్ని కోట్లు వెనుకేసుకుంటున్నారు. అలాంటిది దేశ అత్యున్నత పౌరుడి స్థానంలో ఉండి కూడా తనకు ఇచ్చిన గిఫ్ట్ కు డబ్బులు ఇచ్చిన వ్యక్తి మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం.
పేదరికం జీవితానికి కానీ చదువుకు కాదు. తల్లి సరస్వతిని ఆరాధించి పేదరికాన్ని అధిగమించి విజయాలు సాధించిన ఎందరో విద్యార్థుల స్ఫూర్తిదాయకమైన కథలను మీరు విన్నారు. ఇప్పుడు ఇందుకు చక్కటి ఉదాహరణగా ఓ యువతి కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీధిలో భిక్షాటన చేస్తూ, చెత్త కుండీల నుండి పాత ఆహారం తింటూ గడిపిన ఓ చిన్నారి నేడు డాక్టర్‌గా మారింది. అవును, హిమాచల్ ప్రదేశ్‌లోని టిబెటన్ శరణార్థుల శిబిరంలో పింకీ హర్యాన్ అనే విద్యార్థిని దేశాన్ని…
తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు రేవంత్ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రీప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీ తయారీకి ఈ కమిషన్ ఏర్పాటు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
వైస్ ఛాన్స్‌లర్స్ లేకుండా తెలంగాణలో విశ్వవిద్యాలయాలు ఇంకెన్నాళ్ళు అలా ఉండాలి? నియామకం విషయంలో ప్రభుత్వానికి సీరియస్‌నెస్ లేదా? పది వర్శిటీలకు పాలక మండళ్ళు లేకుంటే...ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తున్నట్టు? విద్యారంగానికి ప్రాధాన్యం ఇస్తామన్న మాట నిలబెట్టుకునేది ఇలాగేనా? వీసీల ఎంపికలో ప్రభుత్వానికి అడ్డుపడుతున్నదేంటి? సీరియస్ ఎపిసోడ్‌ని లైట్ తీసుకుంటున్నారన్న విమర్శల్లో నిజమెంత?
Anand Mahindra: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీకి గవర్నర్స్ బోర్డు చైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూపు కంపెనీల చైర్మన్ ఆనంద్ మహీంద్రాను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
Manda Krishna Madiga: విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లపై ఏపీ, తెలంగాణ సీఎంలను కలుస్తామని మందకృష్ణ మాదిగ అన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ను అమలు చేసే అధికారం రాష్ట్రాలకే ఉందని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చిందన్నారు.
విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.3 కోట్లు వసూలు చేశారు దంపతుల జంట. ఈ ఘటన మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా ఉరాన్‌లో చోటు చేసుకుంది. ఓ సంస్థను కలిగి ఉన్న దంపతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. విదేశాల్లో చదువు, ఉద్యోగం ఇప్పిస్తానని ఓ డాక్టర్‌తో పాటు అతని కుటుంబసభ్యులను రూ.3 కోట్లకు పైగా మోసం చేశారన్న ఆరోపణలు వీరిపై ఉన్నాయి.
విద్యాసంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఆ స్కూల్లో మాత్రం తరగతులు ప్రారంభం కాలేదు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ములుగు జిల్లాలోని మంగపేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన కస్తూరిబా బాలికల ఆశ్రమ పాఠశాల ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు.