పలు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ రిలీజ్ కాగా దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే లక్షల్లో జీతాలు అందుకోవచ్చు. ప్రస్తుతం దేశంలో ఐదు ప్రధాన ప్రభుత్వ నియామకాలు జరుగుతున్నాయి. CBSE-QUAS-NVSలో బోధనా పోస్టులు, వైమానిక దళం కోసం AFCAT నియామకాలు, SAILలో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఖాళీలకు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. కొన్ని ఉద్యోగాలకు పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక…
Balakrishna: ప్రముఖ సినీ నటుడు, శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ ముంబైలోని వాడాలాలో ఉన్న ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ స్కూల్‌ను సందర్శించి, విద్యార్థులతో ముచ్చటించారు. గత 77 సంవత్సరాలుగా తెలుగు సమాజానికి విద్యా సేవలు అందిస్తున్న ఈ సంస్థ, తన గొప్ప చరిత్రతో విద్యా రంగంలో విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది. నర్సరీ నుండి 12వ తరగతి వరకు విద్యను అందిస్తున్న ఈ పాఠశాలలో సుమారు 4,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. 150 మంది అధ్యాపకులు, సిబ్బంది వీరికి…
మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి విద్యార్థులు మరొకసారి ఒక ప్రత్యేక శిక్షణానుభవానికి సాక్ష్యమయ్యారు. సైన్స్ ఉపాధ్యాయుడు భీంపుత్ర శ్రీనివాస్ కాస్త భిన్నంగా తయరయ్యారు.
తల్లికి వందనం పథకంపై శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఏపీలో తల్లికి వందనం పథకం పెండింగ్ దరఖాస్తులకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆమోదం తెలిపారు.. విద్యా శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించిన లోకేష్.. పథకానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న రూ.325 కోట్లు రిలీజ్ కు అనుమతి ఇచ్చారు.. దీంతో, త్వరలోనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం పథకానికి సంబంధించిన సొమ్ము జమకానుంది.
విద్య, ఆరోగ్యంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండోర్‌లో ఆయన మాట్లాడుతూ.. విద్య, ఆరోగ్యం.. ఈ రెండూ కూడా సామాన్యుడికి దూరమైపోయాయని తెలిపారు.
Promotions : తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా డైరెక్టరేట్ పరిధిలో పనిచేస్తున్న 81 మంది జూనియర్ లెక్చరర్లకు ప్రిన్సిపాల్ పదోన్నతులు లభించాయి. సోమవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఈ పదోన్నతులను అధికారికంగా ప్రకటిస్తూ, ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి పరీక్షల నియంత్రణాధికారి జయప్రదా బాయి, మెదక్, రంగారెడ్డి జిల్లాల డీఐఈఓలు హాజరయ్యారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ, పదోన్నతి పొందిన లెక్చరర్లను శుభాకాంక్షలు తెలియజేశారు. Off…
Telangana: ఈ విద్యా సంవత్సరం 202-26 ఇంజనీరింగ్ కాలేజ్ ల ఫీజు పెంపు లేనట్టే.. పాత ఫీజులనే కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫీజుల పెంపు విషయంలో కాలేజీలు ఇచ్చిన రిపోర్టులు, కాలేజీల్లో ఉన్న వసతులై అధ్యయనం చేసేందుకు సబ్ కమిటీ వేయాలని AFRC నిర్ణయం తీసుకుంది.
KTR: కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం మాత్రమే కాదు అని కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్ ) మండిపడ్డారు. విద్యా వ్యవస్థ కూడా కుంటుపడింది.. వ్యవసాయ రంగం పట్ల నిబద్ధత లేదు అని పేర్కొన్నారు. విద్యావ్యవస్థ పట్ల బాధ్యత లేదు.. వానాకాలం సీజన్ మొదలవుతున్నా రైతు రోసా అమలు విషయంలో ప్రణాళిక లేదు అని ఆరోపించారు.
సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ టెన్త్ పరీక్షల నిర్వహణలో పూర్తిగా ఫెయిల్ అయ్యారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. మీ పాలనలో విద్యారంగం భ్రష్టుపట్టిపోయిందని పేర్కొన్నారు. మీ అవివేక, అనాలోచిత, పరిణితిలేని నిర్ణయాలతో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కష్టాలే ఎదురవుతున్నాయని. 10వ తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనాన్ని కూడా సరిగ్గా నిర్వహించలేని దుస్థితిలో ఉన్నారని తీవ్రంగా విమర్శించారు.
ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లాను నక్సల్ ప్రభావిత ప్రాంతాల జాబితా (LWE - లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజం) నుంచి తొలగిస్తూ.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఇది ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రానికి, ముఖ్యంగా బస్తర్‌కు ఒక చారిత్రాత్మక విజయంగా పరిగణించబడుతుంది. గత కొన్ని ఏళ్లుగా భద్రతా దళాలు, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రజల ఉమ్మడి ప్రయత్నాల కారణంగా బస్తర్‌లో నక్సలైట్ల ఏరివేత సమర్థవంతంగా ముగిసింది. ఈ ప్రాంతంలో ప్రస్తుతం శాంతి పునరుద్ధరించబడింది.