విద్యను ఎవరు దోచుకోలేరు, విద్య పంచుకుంటేనే విజ్ఞానం పెరుగుతుందని పేర్కొన్నారు.. ఆ ఉద్దేశంతో విద్యాధన్ ఫౌండేషన్ పని చేయడం అభినందనీయం అని చెప్పుకొచ్చారు. మీ ప్రయత్నాలకు మా ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సీతక్క వెల్లడించారు.
Jupally Krishna Rao : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌లో గ్రంథాలయ అభివృద్ధి కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి జూపల్లి కృష్ణ రావ్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, జిల్లా గ్రంథాలయ ఛైర్మెన్ మధుసూదన్ రెడ్డి, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు. మంత్రి జూపల్లి కృష్ణా రావు మాట్లాడుతూ నేటి సమాజంలో, ప్రస్తుత పరిస్థితుల్లో సంస్కారం నేర్పేది విద్య మాత్రమే అన్నారు. గ్రంథాలయాల్లో మహనీయుల పుస్తకాలు ఉండాలన్నారు. అభివృద్ధి…
CMR College: హైదరాబాద్‌లోని CMR కాలేజ్ హాస్టల్ వద్ద విద్యార్థి సంఘాల వల్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థుల సమస్యలను తెలుసుకోవాలని వచ్చిన NSUI (నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా) విద్యార్థి సంఘ నాయకులు, కాలేజ్ యాజమాన్యంతో గొడవకు దిగారు. గర్ల్స్ హాస్టల్ లోపలికి అనుమతి లేకుండా ఎలా వెళ్ళారని సిబ్బంది ప్రశ్నించడంతో విద్యార్థి సంఘాల నాయకులు సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. నిన్నటి సంఘటనతో గర్ల్స్ హాస్టల్ లో భయాందోళనకు గురైన విద్యార్థులు, తల్లిదండ్రులకు సమాచారం…
CM Revanth Reddy : కన్హా శాంతి వనంను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదివారం సందర్శించారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని కన్హా గ్రామంలోని కన్హా శాంతివనంలో చిన్నారులు, విద్యార్థులకు అందించే సాఫ్ట్ స్కిల్స్ కు సంబంధించి వివరాలు తెలుసుకున్నారు. కళ్లకు గంతలు కట్టుకుని రంగులను గుర్తించడం, పదాలను చదవడం వంటి స్కిల్స్ ను అక్కడి విద్యార్థులు ప్రదర్శించడం చూసి ముఖ్యమంత్రి వారిని అభినందించారు. ఇలాంటి స్కిల్స్ ను ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్సియల్ స్కూల్స్ లోనూ అందించేలా…
Minister Narayana : నెల్లూరు నగరంలోని బి.వి.ఎస్. నగరపాలక సంస్థ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన తల్లిదండ్రులు.. ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజున తల్లిదండ్రులు.. ఉపాధ్యాయుల సమావేశాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధికంగా ప్రాధాన్యమిస్తోందని, రాష్ట్రంలో కొత్తగా ఐదు ప్రాంతాల్లో మోడల్ స్కూల్స్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు మంత్రి నారాయణ. కార్పొరేట్ స్కూల్స్ విజయానికి కారణం తల్లిదండ్రులు..…
గురువు అంటే తండ్రిలా భావించి, విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకోవాలి. వారికి విద్యాభ్యాసం, సరైన మార్గదర్శనాలు అందించి సమాజంలో మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దాలి. కానీ కొంతమంది వ్యక్తులు గాడి తప్పి, వారి పాత్రను మరిచిపోతున్నారు.
నాగాలాండ్ సహా వెనుకబడిన ఈశాన్య రాష్ట్రాలను సమగ్రాభివ్రుద్ది చేసేందుకు నరేంద్రమోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా నాగాలాండ్ లో పర్యటిస్తున్న బండి సంజయ్ అందులో భాగంగా ఈరోజు (మంగళవారం) మొకాక్ చుంగ్ జిల్లాలో పర్యటించారు.
జగిత్యాల జిల్లా నుంచి మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ పార్టీని, ముఖ్యంగా గత ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించారు. 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యారంగం పట్ల సరైన దృష్టి ఇవ్వలేదని, విద్యారంగం పూర్తిగా నిర్వీర్యమైపోయిందని ఆమె పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ.. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం విద్యారంగాన్ని గాడిలో పెట్టేందుకు, విద్యా రంగాన్ని పునరుద్ధరించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు.
ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ పిలుపు మేరకు ఈ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని, రాహుల్ గాంధీ పిలుపు మేరకు కులగణన గత ఎన్నికల్లో పిలుపునిచ్చారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగనన చేపడుతామని హామీ మేరకు ఇచ్చిన హామీ ప్రకారం కులగణన చేస్తున్నామని ఆయన తెలిపారు.
ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇటీవల పలు సమీక్షలను నిర్వహించారు. సోమవారం మేధావులతో సమావేశమై అభిప్రాయాలను స్వీకరించారు. మంగళవారం సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి ఇంటి నుండి వివరాలను సేకరించడంపై దృష్టి పెట్టాలని డిప్యూటీ సీఎం సూచించారు.