AP ICET Results: ఏపీ ఐసెట్-2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 6న ఏపీలో 111, తెలంగాణలో 2 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తంగా 48,828 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 44,446 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఈ ఫలితాలను అనంతపురంలోని ఎస్కేయూలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి విడుదల చేశారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి తమ ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ సారి ఏపీ ఐసెట్-2024 పరీక్షను అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నిర్వహించింది. ఈ ఏపీ ఐసెట్-2024 ద్వారా 2024-25 విద్యా సంవత్సరానికి ఏపీ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో ఫుల్ టైం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అభ్యర్థులకు మే 6, 7వ తేదీల్లో ఐసెట్ ప్రవేశ పరీక్షను రెండు షిఫ్టుల్లో నిర్వహించారు.
*పరీక్ష ఫలితాల కోసం.. డైరెక్ట్ లింక్ ఇదే..