ఆంధ్రప్రదేశ్‌లో నేడు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు విద్యామండలి అధికారికంగా ప్రకటించింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు.
TS TET 2024: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్ టెట్) దరఖాస్తు ప్రక్రియ నిన్న (బుధవారం) నుంచి ప్రారంభమైంది. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 10 వరకు ఆన్‌లైన్‌లో https://tstet2024.aptonline.in/tstet/లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ నిర్వహణకు షెడ్యూల్‌లు విడుదల చేసిన విషయం విదితమే కాగా.. ఇప్పుడు డీఎస్సీ-2024 షెడ్యూల్‌లో మార్పులు చేసింది ప్రభుత్వం.. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఓ ప్రకటన విడుదల చేశారు..
విద్యపై ముంబై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భారతీయ సంస్కృతిలో ఒకప్పుడు విద్యకు ఎంతో పవిత్రత ఉండేదని, కానీ ప్రస్తుతం అటువంటి విద్య విద్యార్థులకు అందుబాటులో లేకుండా పోయిందని బాంబే హైకోర్టు (Bombay High Court) వ్యాఖ్యానించింది.
ఏపీ విద్యారంగంలో మరో చరిత్రాత్మక నిర్ణయం తీసుకోబడింది. సీఎం వైయస్ జగన్ ప్రభుత్వంలో మరో గొప్ప ముందడుగు పడింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ విద్య అమలుకు జగన్ సర్కారు శ్రీకారం చుట్టింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఐబీ మధ్య ఒప్పందం కుదిరింది.
విద్యా రంగంలో ఏపీ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ ఐబీ సిలబస్ చేర్చనుంది. రాష్ట్ర ప్రభుత్వ SCERTతో అంతర్జాతీయ విద్యా బోర్డు IB భాగస్వామ్యంతో ఏపీ ప్రభుత్వం ముందడుగు వేయనుంది. అందుకు రేపు ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఒప్పందం జరుగనుంది. రేపు ఉదయం 10 గంటలకు అంతర్జాతీయ విద్యా బోర్డుతో రాష్ట్ర ప్రభుత్వ ఎస్‌సీఈఆర్‌టీ (SCERT) ఒప్పందం చేసుకోనుంది.
విద్యా రంగంలో విప్లవాత్మకమైన మార్పులను ప్రభుత్వం తీసుకొచ్చిందని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పన కోసం ప్రభుత్వం 17,805 కోట్లు వ్యయం చేసిందని తెలిపారు. 15వేల గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పౌర సేవలను రాష్ట్ర ప్రభుత్వం సమర్ధవంతంగా అందిస్తోందన్నారు. ప్రజల సహకారంతో సమస్యలు అధిగమించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని.. కుల, మత రాజకీయ వివక్ష లేకుండా పథకాలు అందిస్తున్నామని ఏపీ గవర్నర్ చెప్పారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రజలను…
ASER report: గ్రామీణ భారతదేశంలో విద్యార్థుల చదువులు అంతంత మాత్రంగా ఉన్నట్లు ASER 2023 'బియాండ్ బేసిక్స్' సర్వేలో వెల్లడైంది. గ్రామీణ ప్రాంతాల్లో 14-18 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలు సులభమైన సాధారణ ఇంగ్లీష్ వ్యాఖ్యలను కూడా చదవలేకపోతున్నారని తేలింది. దీంతో పాటు లెక్కలు చేయడంలో కూడా విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నారని వార్షిక విద్యా స్థితి నివేదిక ప్రకారం ( ASER) 2023 బుధవారం వెల్లడించింది. ప్రభుత్వాలు తన విధానాలను రూపొందించేందుకు ASER నివేదికలను ఉపయోగించుకుంటాయి.