ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లాను నక్సల్ ప్రభావిత ప్రాంతాల జాబితా (LWE - లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజం) నుంచి తొలగిస్తూ.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఇది ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రానికి, ముఖ్యంగా బస్తర్‌కు ఒక చారిత్రాత్మక విజయంగా పరిగణించబడుతుంది. గత కొన్ని ఏళ్లుగా భద్రతా దళాలు, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రజల ఉమ్మడి ప్రయత్నాల కారణంగా బస్తర్‌లో నక్సలైట్ల ఏరివేత సమర్థవంతంగా ముగిసింది. ఈ ప్రాంతంలో ప్రస్తుతం శాంతి పునరుద్ధరించబడింది.
Osmania University : స్పేస్ టెక్నాలజీ రంగంలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలో పరిశోధన, శిక్షణ, నైపుణ్య అభివృద్ధి కోసం ప్రముఖ విద్యా సంస్థలు, అంతరిక్ష పరిశోధనా సంస్థల మధ్య కీలక ఒప్పందాలు కుదురుతున్నాయి. తాజాగా, ఉస్మానియా యూనివర్శిటీ (ఓయూ) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కి అనుబంధంగా ఉన్న నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్సీ)తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, తదుపరి ఐదేళ్లపాటు ఇస్రో, ఎన్‌ఆర్‌ఎస్సీ, ఓయూ సంయుక్తంగా…
జూనియర్ ఇంటర్ MPCలో 470 మార్కులకు గాను శ్రీచైతన్య స్టేట్ టాప్ మార్క్ 468తో 103 మంది, 467 ఆపైన 462 మంది, 466 ఆపైన 1073 మంది, 460 ఆపైన 4490, 450 ఆపైన 8479 ఆపైన శ్రీచైతన్య విద్యార్థులే. జూనియర్ ఇంటర్ BiPCలో 440 మార్కులకు గాను శ్రీచైతన్య స్టేట్ టాప్ మార్క్ 438 తో 26 మంది, 437ఆపైన 136 మంది. 436 ఆపైన 304 మంది. 435 ఆపైన 459 మంది,…
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి (TGBIE) గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఇంటర్మీడియట్ కళాశాలలకు వేసవి సెలవులను ప్రకటించింది. ఈ సెలవులు మార్చి 30, 2025 నుంచి ప్రారంభమై జూన్ 1, 2025 వరకు కొనసాగుతాయి. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ బోర్డు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలలు ఈ షెడ్యూల్‌ను కచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది.
బీజేపీ కార్యాలయంలో సూర్యనారాయణ మూర్తి పంచాంగ శ్రవణం చేశారు. ప్రపంచానికి దిశా నిర్దేశనం చేసే శక్తి భారత దేశానికే ఉంది. ప్రతి మహిళలో తల్లిని చూడాలనే జ్ఞానం అందరిలో పెరుగుతుంది. ప్రభలమైన మార్పులు దేశంలో చోటు చేస్కోబోతున్నాయి. పాడి పంటలతో దేశం, ప్రతి గ్రామం పరిడవిల్లుతుంది. కాంతిని పూజించడంలో ఆనందించేవారు భారతీయులు. భారతదేశాన్ని రక్షించే రాజకీయ పక్షం బీజేపీ.
అమెరికా అధ్యక్షుడిగా రెండో సారి అధికారం చేపట్టాక డొనాల్డ్ ట్రంప్ పాలన చాలా దూకుడుగా కనిపిస్తోంది. ఇటీవల వాణిజ్య యుద్ధం ప్రకటించగా మార్కెట్లు చతికలపడ్డాయి. అనంతరం అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపారు. అలాగే సంస్థాగతం కూడా అనేక మార్పులు తీసుకొచ్చారు.
Hyundai : హ్యుందాయ్ మోటార్ ఇండియా ఆర్థికంగా బలహీనమైన పిల్లలకు స్కాలర్‌షిప్‌లను అందజేసింది. హ్యుందాయ్ హోప్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ కింద కంపెనీ ఈ స్కాలర్‌షిప్‌ను అందించింది.
Inter Board : తెలంగాణలో ఇంటర్ పరీక్షల హడావిడి మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు ఇంటర్ బోర్డు పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలను కొన్ని ప్రైవేటు కాలేజీలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే, ఇప్పటికే 417 కాలేజీల్లో అద్దెకు సీసీ కెమెరాలు తీసుకున్నారు. కొన్ని కార్పొరేట్ కాలేజీల్లో ఇప్పటికే కెమెరాలున్నాయి.…
CM Revanth Reddy : గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని యూనివర్శిటీలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, బీఆర్ఎస్ హయాంలో యూనివర్శిటీలు పునరావాస కేంద్రాలుగా మారాయని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే యూనివర్శిటీల ప్రక్షాళన చేపట్టి, వీసీలను నియమించామని ఆయన గుర్తు చేశారు. రంగారెడ్డి జిల్లాలోని మొగిలిగిద్ద ప్రభుత్వ ఉన్నత పాఠశాల 150 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన పాఠశాల వార్షికోత్సవాలలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ…
జాతీయ సర్వే సంస్థ అసర్ నివేదికతో జగన్ పాలనలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో జరిగిన విధ్వంసం బయటపడిందని విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. ఆయన ప్రచారానికి మేనమామ, వాస్తవానికి కంసమామ అని మరోసారి రుజువైందని విమర్శించారు. "పబ్లిసిటీ కోసం వందల కోట్లు ఖర్చు చేశారే తప్ప విద్యా ప్రమాణాలు పెంచే కనీస చర్యలు తీసుకోలేదని తేటతెల్లం అయ్యింది.