Promotions : తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా డైరెక్టరేట్ పరిధిలో పనిచేస్తున్న 81 మంది జూనియర్ లెక్చరర్లకు ప్రిన్సిపాల్ పదోన్నతులు లభించాయి. సోమవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఈ పదోన్నతులను అధికారికంగా ప్రకటిస్తూ, ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి పరీక్షల నియంత్రణాధికారి జయప్రదా బాయి, మెదక్, రంగారెడ్డి జిల్లాల డీఐఈఓలు హాజరయ్యారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ, పదోన్నతి పొందిన లెక్చరర్లను శుభాకాంక్షలు తెలియజేశారు.
Off The Record: సాయిరెడ్డి గీతోపదేశం అర్ధం కావాల్సిన వాళ్ళకు అయిందా..?
వారు తమ బాధ్యతలను నిబద్ధతతో, సమర్థవంతంగా నిర్వహించాలని కోరారు. విద్యా రంగ అభివృద్ధిలో ప్రిన్సిపాల్స్ కీలక పాత్ర పోషిస్తారని, సంస్థాగత శ్రమ, నాయకత్వం, విజన్‌ను వినియోగించి విద్యా వాతావరణాన్ని మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పదోన్నతుల ప్రక్రియలో పారదర్శకతకు పెద్దపీట వేయడంతో పాటు, సేవా నిబద్ధత, కృషి వంటి అంశాలను ప్రాధాన్యంగా పరిగణించామని ఆయన స్పష్టం చేశారు.
Supreme Court: ప్రధాని మోడీ-ఆర్ఎస్ఎస్‌పై కార్టూన్, సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం..