తెలంగాణలో 2022-2023 విద్యా సంవత్సరానికి పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలీసెట్) నోటిఫికేషన్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ మేరకు ఏప్రిల్ రెండో వారం నుంచి పాలీసెట్ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నట్లు విద్యాశాఖ ప్రకటన చేసింది. జూన్ 4 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపింది. రూ.100 ఆలస్య రుసుముతో జూన్ 5 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. జూన్ 30న పాలీసెట్ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తామని తెలిపింది. పాలీసెట్ ద్వారా పదో తరగతి పూర్తి చేసుకున్న…
అఖిల భారత సర్వీసు అధికారుల ఎంపిక కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ప్రతి ఏడాది సివిల్స్ పరీక్షను మూడు దశల్లో నిర్వహిస్తుంది. ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూల దశల్లో ఉద్యోగులను భర్తీ చేస్తుంది. సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో భాగంగా మెయిన్స్‌కు సంబంధించిన ఫలితాలను గురువారం సాయంత్రం యూపీఎస్సీ విడుదల చేసింది. ఈ పరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి పలు సర్వీసు అధికారులుగా ఎంపిక అవుతారు. సివిల్ సర్వీసెస్-2021లో భాగంగా ప్రిలిమ్స్‌లో…
యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. డిగ్రీలో నాలుగేళ్ల కోర్సు, 8 సెమిస్టర్ల విధానానికి యూజీసీ గురువారం నాడు ఆమోదం పలికింది. ఈ నాలుగేళ్లలో ఒక్కో సెమిస్టర్ కాల వ్యవధి 90 రోజులు ఉంటుంది. మొదటి మూడు సెమిస్టర్లలో మ్యాథ్స్, సోషల్, హ్యూమానిటీస్, వృత్తి విద్య వంటి సబ్జెక్టులు ఉంటాయని యూజీసీ తెలిపింది. మూడో సెమిస్టర్ ముగిసిన తర్వాత మేజర్, మైనర్ సబ్జెక్టులను విద్యార్థులు ఎంచుకోవాల్సి ఉంటుంది. విద్యార్థుల ఆసక్తి, అప్పటివరకు విద్యార్థులు చూపిన…
తెలంగాణలో త్వరలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)ను నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. టెట్ నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని ఆమె తెలిపారు. దీంతో త్వరలో టెట్ నిర్వహణకు చర్యలు తీసుకుంటామని మంత్రి సబిత వెల్లడించారు. అలాగే ఉద్యోగ అభ్యర్థుల కోసం ప్రతి యూనివర్సిటీ పరిధిలో ఫ్రీ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ల నియామకాలను సైతం త్వరలో చేపడతామన్నారు. మరోవైపు మన ఊరు మన బడి కార్యక్రమం కింద…
ఏపీలో ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 7 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. ఈ ఏడాది జంబ్లింగ్ విధానం లేకుండా పరీక్షలు జరపనున్నట్లు పేర్కొంది. సెకండియర్ విద్యార్థులంతా రేపటి నుంచి తమ హాల్ టికెట్లను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ bie.ap.gov.in ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందిగా సూచించింది. కాగా ప్రాక్టికల్స్ పరీక్షలకు జంబ్లింగ్ విధానాన్ని ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు గురువారం…
సీబీఎస్‌ఈ టర్మ్ 2 పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి జరగనున్నాయి. ఈ మేరకు 10, 12 తరగతులకు సంబంధించి బోర్డు పరీక్షల షెడ్యూల్‌ను సీబీఎస్‌ఈ విడుదల చేసింది. పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి ప్రారంభం అవుతాయని సీబీఎస్‌ఈ స్పష్టం చేసింది. అలాగే మే 24న ఈ పరీక్షలు ముగుస్తాయని షెడ్యూల్‌లో స్పష్టం చేసింది. 12వ తరగతి పరీక్షలు కూడా ఏప్రిల్ 26న ప్రారంభం అవుతాయని.. ఈ పరీక్షలు జూన్ 15న పూర్తవుతాయని తెలిపింది. ఈ…
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేస్తూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 21న జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు మార్చాల్సి ఉంది. సవరించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 22 నుంచి మే 11 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు, ఏప్రిల్ 23 నుంచి మే 12 వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి. అటు మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు..…
తెలంగాణలో టెన్త్ పరీక్షలకు సమయం దగ్గర పడుతోంది. మే 11 నుంచి పరీక్షలు జరగనున్నాయి. అయితే పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసిన నాటి నుంచి విద్యార్థుల్లో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే కరోనా వల్ల ఈ ఏడాది కూడా అంతంత మాత్రమే క్లాసులు జరిగాయ్. దీంతో విద్యార్థులను పరీక్షలకు ఎలా సన్నద్ధం చేయాలో అధికారులకు పాలుపోవడం లేదు. అటు పరీక్షలు ఎలా రాయాలో తెలియక విద్యార్థులు అయోమయంలో ఉన్నారు. తెలంగాణలో చివరిగా టెన్త్ పరీక్షలు 2018-2019…
తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ విద్యార్థులకు వార్షిక పరీక్షల్లో ప్రశ్నల ఛాయిస్‌ను రెట్టింపు చేయాలని నిర్ణయించింది. ప్రశ్నల సంఖ్యను కూడా గణనీయంగా పెంచింది. గతంలో కొన్ని సెక్షన్లలో మాత్రమే ఛాయిస్ ప్రశ్నలు ఇవ్వగా, ఈ ఏడాది అన్ని సెక్షన్లలో ప్రశ్నల సంఖ్యను పెంచి, ఛాయిస్‌గా వదిలేసుకొనే అవకాశం కల్పించింది. 2021-22 సంవత్సరానికి తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియాల మాదిరి ప్రశ్నపత్రాలను ఇంటర్ బోర్డు అధికారులు వెబ్‌సైట్‌లో పెట్టారు. గత ఏడాది మూడు సెక్షన్లకు…
మార్చిలో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యా దీవెన డబ్బులను ఏపీ ప్రభుత్వం జమ చేయనుంది. అయితే జగనన్న విద్యాదీవెన వెరిఫికేషన్ పూర్తికాలేదని ఫోన్‌కు సందేశాలు వచ్చిన విద్యార్థులు వెంటనే గ్రామ లేదా వార్డు సచివాలయాలకు వెళ్లి.. ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్‌కు సంబంధించిన డాక్యుమెంట్స్‌ను సమర్పించాలి. వెరిఫికేషన్ పూర్తై ఇన్ఎలిజిబుల్ అయితే.. సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్లను కలవాలి. అర్హత ఉన్న విద్యార్థులు అబ్జెక్షన్ రైజ్ చేయడానికి ఈ నెల 21 వరకు గడువు ఉంది. మార్చిలో జగనన్న…