తెలంగాణలో కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో 92.61 శాతం మంది అర్హత సాధించినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి ప్రకటించారు. అయితే ఈ కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్టులో పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా అర్హత సాధించారు. మహిళలు 41,131 మంది క్వాలిఫై కాగా పురుషులు 22,614 మంది మాత్రమే అర్హత సాధించడం గమనార్హం. అంటే పురుషుల కంటే రెట్టింపు స్థాయిలో మహిళలు క్వాలిఫై అయ్యారు. గత ఏడాది కూడా మహిళలే…