తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు వివాదం రేపుతున్నాయి. ఇంటర్ బోర్డు వైఖరి వల్ల చాలా మంది విద్యార్థులు నష్టపోయారంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ కాలేజీల బంద్‌కు పిలుపునిస్తున్నట్లు NSUI ప్రకటించింది. ఇంటర్ బోర్డు తప్పిదాల వల్ల బలైన విద్యార్థుల కోసం తాము పోరాడుతుంటే ఇంటర్ బోర్డు కనీసం స్పందించకుండా పోలీసుల చేత తమను అక్రమంగా అరెస్ట్ చేయిస్తోందని NSUI పెద్దపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్ము అభిలాష్ ఆరోపించారు. Read…
తెలంగాణలో గురువారం విడుదలైన ఇంటర్ ఫస్టియర్ ఫలితాలపై విద్యార్థుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. చదువు చెప్పకుండా విద్యార్థులను ప్రభుత్వం ఫెయిల్ చేయించిందని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. ఇంటర్నెట్ కనెక్షన్ లేక చాలామంది పేద విద్యార్థులు తరగతులకు హాజరు కాలేకపోయారని, ఫెయిలైన వారందరినీ పాస్ చేయాలని డిమాండ్ చేశాయి. దీంతో ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. Read Also:…
తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో చాలా మంది విద్యార్థులకు తక్కువ మార్కులు రావడం చర్చనీయాంశంగా మారింది. కొన్నింటిలో 90కి పైగా మార్కులు రాగా మరికొన్నింట్లో తక్కువ మార్కులు వచ్చాయి. దీంతో కొన్ని సబ్జెక్టుల్లో ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు కూడా ఫెయిల్ అయ్యారు. ఉదాహరణకు హైదరాబాద్ నగరానికి చెందిన ఓ విద్యార్థికి ఇంగ్లీష్‌లో 92 మార్కులు, సంస్కృతంలో 93 మార్కులు, ఫిజిక్స్‌లో 55 మార్కులు, కెమిస్ట్రీలో 50 మార్కులు రాగా మ్యాథ్స్ Aలో 27, మ్యాథ్స్ Bలో…
కరోనా వైరస్ కారణంగా తెలంగాణలో గత ఏడాది రద్దయిన ఫస్టియర్ పరీక్షలను అధికారులు ఇటీవల నిర్వహించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 25 నుంచి నవంబర్ 3 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను నిర్వహించగా… ఆ ఫలితాలను ఈరోజు విడుదల చేశారు. మొత్తం 4.59 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రాయగా 49 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇంటర్ ఫలితాలను చెక్ చేసుకునేందుకు tsbie.cgg.gov.in లేదా manabadi.com వెబ్‌సైట్లను సందర్శించవచ్చు.…
తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాలను బుధవారం ప్రకటించాలని ఇంటర్ బోర్డు అధికారులు భావిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా గత ఏడాది రద్దయిన ఫస్టియర్ పరీక్షలను ఇటీవల నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ ఫలితాలను రేపు విడుదల చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. థియరీ పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తయినప్పటికీ ప్రథమ సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించిన తర్వాతే ఫలితాలు విడుదల చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 3…
ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాఠశాలల విలీనం పై మరోసారి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పాఠశాలల విలీనం పై కొన్ని చోట్ల వ్యతిరేకత వచ్చిన విషయం తెల్సిందే.. అయితే తాజాగా రాష్ర్టంలో100లోపు విద్యార్థులున్న ఉన్నత పాఠశాలలో నుంచి ప్రాథమిక పాఠశాలల 3,4,5 తరగతులను విలీనం చేయవద్దని విద్యాశాఖ నిర్ణయించింది. ఏ యాజమాన్య పాఠశాలను అదే యాజమాన్య పాఠశాలలో కలపాలని, గిరిజన సంక్షేమ పాఠశాలలను అసలు విలీనం చేయవద్దని తెలిపింది. 20 మంది కన్నా తక్కువ…
తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ టెస్టు-2021 ఫలితాలు సోమవారం మధ్యాహ్నం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి ప్రకటించారు. ఈ ఫలితాల్లో 96.99 శాతం మంది అర్హత సాధించారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ టెస్టు కోసం 5,054 మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 14 కేంద్రాల్లో అక్టోబర్ 23న నిర్వహించిన ఈ పరీక్షకు 3,087 మంది అభ్యర్థులు హాజరు కాగా 2,994 మంది అర్హత సాధించారు. Read Also: తెలంగాణ వ్యాప్తంగా ఎంతమంది…
నవంబర్ 1న సోమవారం నాడు తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-2021 ఫలితాలను విడుదల చేయనున్నట్లు పీఈ సెట్ కన్వీనర్ తెలిపారు. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆర్ లింబ్రాది, పీఈ సెట్ ఛైర్మన్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్ గోపాల్‌రెడ్డి ఈ ఫలితాలను ప్రకటిస్తారని పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. Also Read: నవంబర్ 1 నుంచి ఏం మారనున్నాయి? కాగా యూజీడీపీఈడీ, బీపీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే…
తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారైంది. నవంబర్ 3 నుంచి ఈ కౌన్సెలింగ్ ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. తొలి విడత ఐసెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం నవంబర్ 3 నుంచి 9 వరకు స్లాట్ బుకింగ్ ఉంటుందని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలియజేశారు. నవంబర్ 6 నుంచి 10 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందన్నారు. Read Also: కొత్తిమీర…
తెలంగాణ ఇంటర్ పరీక్షల విషయంలో హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను రద్దు చేయాలని తల్లిదండ్రుల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం నాడు హైకోర్టు అత్యవసర విచారణ జరిపింది. అక్టోబర్ 25 నుంచి పరీక్షలు ఉండగా ఇప్పుడు పిటిషన్ వేస్తే ఎలా? అని హైకోర్టు పిటిషన్ దారులను ప్రశ్నించింది. చివరి నిమిషంలో ఇంటర్ పరీక్షలపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఇంటర్ పరీక్షలను ఆపలేమని న్యాయస్థానం తేల్చి చెప్పింది. యథావిధిగా పరీక్షలు నిర్వహించుకోవచ్చని…