CBSE 10th class Results: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి ఫలితాలను అధికారులు ఈరోజు విడుదల చేశారు. కొన్నిరోజులుగా ఈ ఫలితాల కోసం విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. https://cbseresults.nic.in సైట్ ద్వారా అభ్యర్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. విద్యార్థులు తమ రోల్ నంబర్, పుట్టినతేదీ, స్కూల్ నంబర్లతో ఫలితాలను పొందవచ్చు. ఏప్రిల్ 26 నుంచి మే 24 వరకు సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు జరిగాయి. 7,046 సెంటర్లలో ఈ…
ఏపీలో ఈనెల 4 నుంచి 12 వరకు జరగనున్న ఈఏపీసెట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శి శ్యామలరావు వెల్లడించారు. జూలై 4 నుండి 8 వరకు ఇంజినీరింగ్ పరీక్ష లు జరుగుతాయని.. జూలై 11,12 తేదీలలో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్ష జరుగుతుందని వివరించారు. మొత్తం 122 సెంటర్లలో పరీక్షలు జరుగుతాయని శ్యామలరావు వివరించారు. రెండు సెంటర్లు తెలంగాణలో ఉంటాయని తెలిపారు. ఈఏపీసెట్ పరీక్షల కోసం మొత్తం 3 లక్షల 84…
ఏపీలోని విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 20 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలలో ఈ విద్యా సంవత్సరం నుంచి అప్రెంటీస్‌షిప్‌తో కూడిన 11 కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు సెక్టార్ స్కిల్స్ కౌన్సిల్స్, కళాశాల విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నట్లు కమిషనర్ పోలా భాస్కర్ వెల్లడించారు. కొత్త కోర్సులలో బీఏ టూరిజం, హాస్పిటాలిటీ బీబీఏ, హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్, బీబీఏ లాజిస్టిక్స్, బీబీఏ డిజిటల్ మార్కెటింగ్, బీబీఏ రిటైల్ ఆపరేషన్స్, బీఎస్సీ…
వేసవి సెలవుల అనంతరం ఇవాల్టి నుంచి సోమవారం (జూన్ 13) నుంచి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తిరిగి తెరచుకుంటున్నాయి. సుమారు 60 లక్షల మంది విద్యార్ధులు బడిబాట పట్టనున్నారు. కోవిడ్ కేసుల పెరుగుదల, పుస్తకాల పంపిణీ పూర్తవకపోవడం, వేసవి తీవ్రత ఇంకా కొనసాగుతన్న నేపథ్యంలో సెలవులు పొడిగిస్తారన్న ప్రచారం జరిగినా.. ఆ ఊహాగానాలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెరదించారు. జూన్ 13వ తేదీ నుంచి యథావిథిగా పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయని స్పష్టం చేసారు.…
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చదువు పూర్తయ్యాక ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్య శిక్షణ పొందడం ప్రస్తుత మన విద్యా విధానం. మున్ముందు కోర్సు అవగానే కొలువులు సాధించేలా విద్యార్థులు సుశిక్షితులు కానున్నారు. ఈ నేపథ్యంలో ఆధునిక ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేలా భావి భారత పౌరులను తీర్చిదిద్దేందుకు దేశవ్యాప్తంగా పీఎంశ్రీ పాఠశాలలను నెలకొల్పనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. జాతీయ నూతన విద్యా విధానానికి ఈ పాఠశాలలు ప్రయోగశాలలుగా ఉపయోగపడతాయని ఆయన అభివర్ణించారు.…
నీట్ పీజీ- 2022 పరీక్షపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షను వాయిదా వేయాలంటూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఆ పిటిషన్‌లపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా నీట్ పీజీ పరీక్షను వాయిదా వేయలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పరీక్ష ఆలస్యమైతే డాక్టర్ల కొరత ఏర్పడుతుందని, తద్వారా రోగుల సంరక్షణపై తీవ్ర ప్రభావం పడుతుందని కోర్టు అభిప్రాయపడింది. అటు పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న లక్షల విద్యార్థుల జీవితాలను అయోమయంలోకి నెడుతుందని,…
యూజీసీ నెట్ అర్హత పరీక్ష 2022 నోటిఫికేషన్ విడుదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఈ నోటిఫికేషన్‌ను ఆదివారం నాడు విడుదల చేసింది. 2021 డిసెంబర్, 2022 జూన్ రెండు పరీక్షలకు ఒకే నోటిఫికేషన్‌ను ఎన్టీఏ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. మే 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు ఎన్టీఏ వెల్లడించింది. మొత్తంగా 82 సబ్జెక్టులకుగానూ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో నిర్వహించే పరీక్షకు…
రోజుకు రోజుకు ఎండలు పెరుగుతున్నాయి. వేసవి తాపంతో అటు చిన్నారుల నుంచి ఇటు వృద్ధుల వరకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో స్కూళ్లకు సంబంధించి ఒంటి పూట బడుల నిర్వహణపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 4 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. వేసవి తీవ్రత ఆధారంగా విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 7:30…
తెలంగాణలో ఎంసెట్-2022, ఈసెట్-2022 ప్రవేశపరీక్షలకు నోటిఫికేషన్‌లను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఎంసెట్ కోసం ఏప్రిల్ 6 నుంచి మే 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. జూలై 14,15 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష.. జూలై 18,19,20 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటన చేసింది. ఎంసెట్ పరీక్ష కోసం దరఖాస్తు ఫీజుగా జనరల్ అభ్యర్థులు అయితే రూ.800.. ఎస్సీ, ఎస్టీలు అయితే రూ.400 చెల్లించాల్సి ఉంది. మరోవైపు ఈసెట్…
తెలంగాణలో టీచర్ల ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. గురువారం రాత్రి తెలంగాణ సర్కారు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో టెట్ పరీక్ష దరఖాస్తులు స్వీకరిస్తామని విద్యాశాఖ తెలిపింది. జూన్ 12న టెట్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. అభ్యర్థులు నోటిఫికేషన్ కాపీని ఈ నెల 25 నుంచి tstet.cgg.gov.in వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించింది.…